ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrayaan-3: చంద్రయాన్-3పై తాజా ప్రకటన చేసిన ఇస్రో.. అరుదైన ప్రయోగం గ్రాండ్ సక్సెస్..

ABN, First Publish Date - 2023-12-05T11:44:04+05:30

యావత్ భారతావని సగర్వంగా తలెత్తుకునేలా చేసిన చంద్రయాన్-3 మిషన్‌పై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) తాజా సమాచారాన్ని పంచుకుంది. చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్‌ (PM) కక్ష్యను విజయవంతంగా మార్చినట్టు ప్రకటించింది.

బెంగళూరు: యావత్ భారతావని సగర్వంగా తలెత్తుకునేలా చేసిన చంద్రయాన్-3 మిషన్‌పై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) తాజా సమాచారాన్ని పంచుకుంది. చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్‌ (PM) కక్ష్యను విజయవంతంగా మార్చినట్టు ప్రకటించింది. ‘‘ అరుదైన ప్రయోగంలో ప్రొపల్షన్ మాడ్యుల్‌ను చంద్రుడి కక్ష్య నుంచి భూకక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టాం. ఒక కక్ష్య పెంపు విన్యాసం, ఒక ట్రాన్స్-ఎర్త్ ఇంజెక్షన్ ప్రక్రియల ద్వారా ప్రొపల్షన్ మాడ్యుల్‌ను భూకక్ష్యలో ప్రవేశపెట్టాం’’ అని వివరించింది. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది.

భవిష్యత్‌లో చేపట్టనున్న ప్రయోగాల కోసం చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్‌ను తిరిగి భూకక్ష్యలోకి తీసుకొచ్చామని వివరించింది. చంద్రుడి నుంచి భూమికి తీసుకొచ్చే ప్రణాళికలు, వాటి అమలుపై పనిచేస్తున్నామని తెలిపింది. ఇలాంటి విన్యాసాల కోసం సాఫ్ట్‌వేర్ మాడ్యూల్‌ను అభివృద్ధి చేసతున్నామని, తాజాగా చేపట్టింది ప్రాథమిక ప్రయోగమని ప్రకటనలో పేర్కొంది. చంద్రుడి ఉపరితలంపై ప్రొపల్షన్ మాడ్యూల్ నియంత్రణ కోల్పోకుండా ప్రయత్నిస్తున్నామని, తద్వారా అంతరిక్షంలో శిథిలాలు ఏర్పడకుండా జాగ్రత్తలు ప్రయత్నిస్తున్నామని ఇస్రో వివరించింది.

Updated Date - 2023-12-05T11:44:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising