ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrayaan-3: చంద్రుడిపై ఏముందంటే.. మరో కీలక విషయాన్ని వెల్లడించిన చంద్రయాన్ 3 ప్రజ్ఞాన్ రోవర్

ABN, First Publish Date - 2023-08-29T21:44:36+05:30

చంద్రుడిపై విజయవంతంగా ప్రయాణిస్తున్న చంద్రయాన్ 3కి చెందిన ప్రజ్ఞాన్ రోవర్ దక్షిణ ధృవ ప్రాంతంలో సల్ఫర్ ఉన్నట్లు గుర్తించింది. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన ట్విట్టర్ (ఎక్స్) ద్వారా అధికారికంగా ప్రకటించింది.

చంద్రుడిపై విజయవంతంగా ప్రయాణిస్తున్న చంద్రయాన్ 3కి చెందిన ప్రజ్ఞాన్ రోవర్ దక్షిణ ధృవ ప్రాంతంలో సల్ఫర్ ఉన్నట్లు గుర్తించింది. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన ట్విట్టర్ (ఎక్స్) ద్వారా అధికారికంగా ప్రకటించింది. ‘‘రోవర్‌లోని లేజర్ ప్రేరిత బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్(LIBS) పరికరం దక్షిణ ధృవం వద్ద చంద్రుడి ఉపరితలంలో సల్ఫర్ (S) ఉనికిని గుర్తించింది.’’ అని ఇస్రో తెలిపింది. సల్ఫర్‌తోపాటు మరో 8 మూలకాలను కూడా గుర్తించినట్లు తెలిపింది. చంద్రుడి దక్షిణ ధృవం వద్ద సల్ఫర్, అల్యూమినియం(Al), కాల్షియం(Ca), ఫెర్రస్(Fe), క్రోమియం(Cr), టైటానియం(Ti), మాంగనీస్(Mn), సిలికాన్(Si), ఆక్సిజన్‌(O)లను ప్రజ్ఞాన్ రోవర్ గుర్తించిందని ఇస్రో పేర్కొంది. అంతేకాకుండా హైడ్రోజన్ కోసం అన్వేషణ కొనసాగిస్తున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఒక గ్రాఫ్‌ను ఇస్రో తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. గ్రాఫ్‌లో చంద్రుడి ఉపరితలంపై వివిధ లోతులలో గల ఉష్ణోగ్రతలో ఉన్న వైవిధ్యాలను ఇస్రో వివరించింది. గ్రాఫ్ ప్రకారం లోతు పెరుగుతున్న కొద్దీ చంద్రుని ఉష్ణోగ్రత తగ్గుతుంది. కాగా ఈ లిబ్స్ పరికరాన్ని బెంగుళూరులోని ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్స్ ప్రయోగశాలలో అభివృద్ధి చేసినట్లు ఇస్రో వెల్లడించింది.


సౌరశక్తితో నడిచే ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ శాస్త్రీయ ప్రయోగాల పరంపరను కొనసాగిస్తున్నందున చంద్రయాన్ 3 మిషన్ మరో ఏడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. శివ శక్తి ల్యాండింగ్ సైట్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని రోవర్ అన్వేషిస్తూనే ఉంటుందని, రోవర్ సుమారు ఎనిమిది మీటర్ల దూరాన్ని కవర్ చేసిందని ఇస్రో అంచనా వేసింది. కాగా చంద్రుని ధూళి, కంకర వంటి రసాయన కూర్పును పరిశోధించడం రోవర్ ప్రాథమిక లక్ష్యాలలో ఒకటి. ఈ పరిశోధన చంద్రుని భూగర్భ శాస్త్రం, వాతావరణం గురించి అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. ఇది మనం చంద్రుడి గురించి ఒక అవగాహనకు రావడానికి దోహదం చేస్తుంది.

Updated Date - 2023-08-29T21:53:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising