Chhattisgarh Election Result: ఛత్తీస్‌గఢ్‌లో మ్యాజిక్ ఫిగర్‌కు మించిన స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం
ABN, First Publish Date - 2023-12-03T10:23:40+05:30
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ చురుకుగా జరుగుతోంది. 90 అసెంబ్లీ స్థానాలకు గాను ఉదయం 9.30 గంటల ప్రాంతానికి 52 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యత కొనసాస్తోంది. దీంతో ఆధిక్యతల పరంగా మ్యాజిక్ ఫిగర్‌ను కాంగ్రెస్ దాటింది. బీజేపీ 38 స్థానాల్లో అధిక్యత కొనసాగిస్తోంది. బీఎస్‌పీ, ఇతరులు ఇంకా ఖాతా తెరవలేదు.
రాయపూర్: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ చురుకుగా జరుగుతోంది. 90 అసెంబ్లీ స్థానాలకు గాను ఉదయం 9.30 గంటల ప్రాంతానికి 52 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యత కొనసాస్తోంది. దీంతో ఆధిక్యతల పరంగా మ్యాజిక్ ఫిగర్‌ను కాంగ్రెస్ దాటింది. బీజేపీ 38 స్థానాల్లో అధిక్యత కొనసాగిస్తోంది. బీఎస్‌పీ, ఇతరులు ఇంకా ఖాతా తెరవలేదు.
రాజ్‌నంద్‌గావ్ నియోజకవర్గంలో బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి దేవాంగన్‌పై ఆధిక్యంలో ఉన్నారు. 2018లో ఇదే నియోజకవర్గం నుంచి రమణ్ సింగ్ 16,933 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ నేత కరుణ శుక్లాపై గెలుపొందారు. బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తుందని రమణ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. 42 నుంచి 55 సీట్లు గెలుచుకుంటామని తెలిపారు. 2018లో కాంగ్రెస్ అధికారంలోకి రాగా, ఈసారి బీజేపీ తిరిగి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది. నవంబర్ 7, 17 తేదీల్లో రెండు విడతలుగా ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్ జరిగింది.
Updated Date - 2023-12-03T10:25:08+05:30 IST