Chennai: బోసినవ్వుల బామ్మ ఇకలేరు
ABN, First Publish Date - 2023-07-29T09:11:58+05:30
ఏదేని ప్రభుత్వ పథకం కింద ఆర్థిక సా యం పొందితే స్వచ్ఛమైన నవ్వు నవ్వే బామ్మ వేళమ్మాల్(Velammal) ఇకలేరు. ఆమె వయసు 92 యేళ్ళు.
- సీఎం స్టాలిన్ సంతాపం
అడయార్(చెన్నై): ఏదేని ప్రభుత్వ పథకం కింద ఆర్థిక సా యం పొందితే స్వచ్ఛమైన నవ్వు నవ్వే బామ్మ వేళమ్మాల్(Velammal) ఇకలేరు. ఆమె వయసు 92 యేళ్ళు. నాగర్ కోయిల్ సమీపంలోని పుత్తేరి సమీ పంలోని కీళకలుంగడి గ్రామ వాసి. వయోభారం కారణంగా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతికకాయానికి ఆ గ్రామ ప్రజ లతో పాటు పలువురు రాజకీయ నేతలు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళి అర్పించారు. వేళమ్మాల్ మృతిపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) తన ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. కన్నియాకుమారి జిల్లాకు చెందిన వేళమ్మాల్ బామ్మ మరణించారనే వార్త తెలిసి ఎంతో బాధకు గురయ్యానన్నారు. ఆమె కరోనా సమయంలో పార్టీ తరపున ఇచ్చిన వివిధ రకాల సహాయాలను అం దుకున్నారని, ఆమెకే సొంతమైన ప్రత్యేకమైన బోసినవ్వుతో ప్రతి ఒక్కరి మనస్సులో చెరగని ముద్ర వేశారని గుర్తు చేసుకున్నారు. ఆమె మృతితో శోకసముద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. కాగా, కరోనా మహమ్మారిని నివారించే నిమిత్తం విధించిన లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన రూ.2 వేల ఆర్థిక సాయాన్ని వేళమ్మాల్ అందుకున్నారు. ఆ సమ యంలో ఒక చేత్తో నోట్లు మరో చేత్తో సంక్షేమ సహాయాల సంచీని పట్టుకుని నవ్వుతూ ఫొటోలకు ఇచ్చిన పొజుతో ఆమె ఒక్కసారిగా గుర్తింపు పొందారు.
Updated Date - 2023-07-29T09:11:58+05:30 IST