Chhattisgarh Exit polls: ఉత్కంఠ రేపుతున్న ఎగ్జిట్ పోల్స్.. ఛత్తీస్‌ఘడ్‌లో గెలుపెవరిదంటే..
ABN, First Publish Date - 2023-11-30T17:58:26+05:30
ఛత్తీస్‌ఘడ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విదుదల. గెలుపెవరిదంటే..
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణతో పాటూ మిజోరం, ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ఎన్నికలు ముగిశాయి. ప్రజలు వెలువరించిన తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా ఉంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. మరోవైపు, ప్రజాతీర్పుపై ఉత్కంఠను మరింత పెంచుతూ ఎగ్జిట్ పోల్స్(Chhattisgarh Exit polls) వెలువడ్డాయి. వామపక్ష తీవ్రవాద ప్రభావం అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాన పోరు మాత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్యే నెలకొంది. భూపేశ్ భాఘేల్ సారథ్యంలో తమకు గెలుపు తథ్యమని హస్తం పార్టీ భావిస్తుండగా మోదీ మ్యాజిక్‌తో విజయం తమదేనంటూ బీజేపీ ధీమాతో ఉంది. అవనీతి రహిత పాలన అందిస్తామంటూ ఆప్ కూడా తమ వంతు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నించింది. అయితే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం బీజేపీ, కాంగ్రెస్ మధ్య సీట్ల విషయంలో స్వల్ప తేడానే ఉండటంతోె ఉత్కంఠ మరింత పెరిగింది. డిసెంబర్ 3న అంచనాలు తారుమారయ్యే ఛాన్స్ కూడా ఉందని విశ్లేషకులు అంచనా వస్తున్నారు.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా ..
1.ఏబీపీ న్యూస్- సీ ఓటర్
బీజేపీ : 36; 48
కాంగ్రెస్ : 41-53
ఇతరులు : 00
2. ఇండియా టుడే-యాక్సి్స్ మైఇండియా
బీజేపీ : 36-46
కాంగ్రెస్ : 40-50
ఇతరులు : 00
3. ఇండియా టీవీ-సీఎన్ఎక్స్
బీజేపీ : 34-45
కాంగ్రెస్ : 42-53
ఇతరులు : 0
4.జన్ కీ బాత్
బీజేపీ: 34-45
కాంగ్రెస్: 42-53
బీఎస్పీ+ : 0
ఇతరులు: 3
5. న్యూస్ 24- టుడేస్ చాణక్య
బీజేపీ : 33
కాంగ్రెస్ : 57
ఇతరులు : 00
6. రిపబ్లిక్ టీవీ-మాట్రీజ్
బీజేపీ : 34-42
కాంగ్రెస్ : 44-52
ఇతరులు : 00
7.టీవీ9 భరత్‌వర్ష్-పోల్‌స్ట్రాట్
బీజేపీ : 35-45
కాంగ్రెస్ : 40-50
ఇతరులు : 00
Updated Date - 2023-11-30T20:09:03+05:30 IST