ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chidambaram: కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు.. ఛైర్మన్‌గా చిదంబరం

ABN, Publish Date - Dec 23 , 2023 | 11:51 AM

కాంగ్రెస్ పార్టీ 2024లో జరగనున్న లోక్ సభ(Lok Sabha) ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా కీలకమైన మేనిఫెస్టో(Congress Manifesto) రూపకల్పనకు పార్టీ ఓ కమిటీ వేసింది. 16 మందితో కూడిన ఈ కమిటీ ఛైర్మన్ గా సీనియర్ లీడర్ పి.చిదంబరాన్ని(Chidambaram) నియమించింది.

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ 2024లో జరగనున్న లోక్ సభ(Lok Sabha) ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా కీలకమైన మేనిఫెస్టో(Congress Manifesto) రూపకల్పనకు పార్టీ ఓ కమిటీ వేసింది. 16 మందితో కూడిన ఈ కమిటీ ఛైర్మన్ గా సీనియర్ లీడర్ పి.చిదంబరాన్ని(Chidambaram) నియమించింది. మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌గా ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ కీలక నేత టీఎస్ సింగ్ డియోని నియమించారు. సభ్యుల ప్యానెల్ లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanaka Gandhi Vadra) వాద్రా ఉన్నారు.

సీడబ్ల్యూసీ(CWC meeting) మీటింగ్ జరిగిన ఒక రోజు తరువాత ఈ లిస్టుని పార్టీ విడుదల చేసింది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ(BJP)ని ఢీ కొట్టడమే ధ్యేయంగా మేనిఫెస్టో రూపకల్పన చేయాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు పూర్తయ్యాక లోక్ సభ ఎన్ని్కల ప్రచార వ్యూహాన్ని నిర్ణయించుకుని.. పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మాజీ మంత్రులు ఆనంద్ శర్మ, జైరాం రమేష్, శశి థరూర్, సీనియర్ నేతలు గైఖాంగమ్, గౌరవ్ గొగోయ్, ప్రవీణ్ చక్రవర్తి ప్యానెల్ లిస్టులో ఉన్నారు.


బీజేపీపై పోరాటమే..

కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి బీజేపీతో పోరాడటానికి నిర్ణయించుకుందని అన్నారు. తమ కూటమి నేతలంతా ఆత్మవిశ్వాసంతో, ఐక్యంగా నిలబడి రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తారు.

మోదీ ప్రభుత్వ లోపాల్ని ఎత్తి చూపుతూ ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు. ఇటీవల 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోవడంపై కారణాలు విశ్లేషించుకుంటామని చెప్పారు.

"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"

Updated Date - Dec 23 , 2023 | 11:51 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising