ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chief Minister: దేశ రాజకీయాల్లో నవశకం.. ఎన్డీయే వర్సెస్‌ ‘ఇండియా’

ABN, First Publish Date - 2023-07-19T11:16:55+05:30

ఇండియన్‌ నేషనల్‌ డెవలె్‌పమెంట్‌ ఇన్‌క్లూజివ్‌ అలయెన్స్‌ (ఇండియా) ఆవిర్భావంతో దేశ రాజకీయాల్లో కొత్తశకం ప్రారంభమైందని ముఖ్యమం

- ఇక యాక్షన్‌ ప్లానే తరువాయి

- బెంగళూరు సభ గ్రాండ్‌ సక్సెస్‌

- ముఖ్యమంత్రి సిద్దరామయ్య

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ఇండియన్‌ నేషనల్‌ డెవలె్‌పమెంట్‌ ఇన్‌క్లూజివ్‌ అలయెన్స్‌ (ఇండియా) ఆవిర్భావంతో దేశ రాజకీయాల్లో కొత్తశకం ప్రారంభమైందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) పేర్కొన్నారు. మంగళవారం బెంగళూరులో ప్రతిపక్ష కూటమి కీలక సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక యాక్షన్‌ప్లానే తరువాయని పేర్కొన్నారు. దేశంలో సరికొత్త విప్లవానికి ‘ఇండియా’ శ్రీకారం చుట్టనుందని తెలిపారు. బెంగళూరు ప్రతిపక్షకూటమి సమావేశం గ్రాండ్‌ సక్సెస్‌ కావడం సంతోషంగా ఉందన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు, పలు రాజకీయ పార్టీల అగ్రనేతలు ఎలాంటి అరమరికలు లేకుండా రెండు గంటలపాటు తమ అభిప్రాయాలను పరస్పరం వినిమయం చేసుకున్నారన్నారు. ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రజా వ్యతిరేక పాలనకు 2024 లోక్‌సభ ఎన్నికల్లో చరమగీతం పాడడం తథ్యమన్నారు. ప్రతిపక్షాల ఓట్ల చీలికల వల్లే ఇంతకాలం బీజేపీ పబ్బం గడుపుకుంటూ వచ్చిందని, ఇకపై ఈ ఆటలు సాగవన్నారు. కర్ణాటకను బీజేపీ విముక్తి చేశామని, దక్షిణాదిన కేంద్ర పాలిత ప్రాంతం పాండిచ్చేరి మినహా బీజేపీ ఎక్కడా లేదన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ బీజేపీ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయన్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, మత విద్వేష రాజకీయాల కారణంగా ప్రజల్లో ఆక్రోశం వెల్లువెత్తుతోందని చెప్పారు. జాతీయస్థాయిలో ప్రతిపక్ష కూటమి సమావేశానికి ఆతిథ్యమిచ్చే అదృష్టం తమకు లభించడం సంతోషంగా ఉందన్నారు.

Updated Date - 2023-07-19T11:16:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising