Chief Minister: హిజాబ్‌పై నిషేధాన్ని తొలగిస్తాం: సీఎం
ABN, Publish Date - Dec 23 , 2023 | 10:32 AM
రాష్ట్రంలో అమలులో ఉన్న హిజాబ్‌పై నిషేధాన్ని తొలగిస్తామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) తెలిపారు.
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అమలులో ఉన్న హిజాబ్‌పై నిషేధాన్ని తొలగిస్తామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) తెలిపారు. చామరాజనగర్ జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడు తూ రాష్ట్రంలో హిజాబ్ నిషేధాన్ని తొలగించే విషయమై అధికారులకు సూచించానని, త్వరలోనే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ అనేది బోగస్ అన్నారు. దుస్తులు, కులమతాల ఆధారంగా సమాజంలో ప్రజలను విభజించే ప్రక్రియను బీజేపీ అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అందరికీ గ్యారెంటీలు అందిస్తోం దన్నారు. బీజేపీ వారు గృహలక్ష్మి, గృహజ్యోతి, శక్తి గ్యారెంటీ, పది కిలోల బియ్యం పొందడం లేదా అని ప్రశ్నించారు.
Updated Date - Dec 23 , 2023 | 10:32 AM