Chief Minister: అసలు విషయం చెప్పేసిన ముఖ్యమంత్రి.. అదేంటంటే..
ABN, First Publish Date - 2023-06-15T12:32:09+05:30
ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాఠ్య పుస్తకాల్లో ఎటువంటి మార్పులు లేవని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Sid
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాఠ్య పుస్తకాల్లో ఎటువంటి మార్పులు లేవని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) స్పష్టం చేశారు. దీంతో గడిచిన మూడు వారాలుగా పాఠ్యాంశాల మార్పునకు సంబంధించి సాగుతున్న గందరగోళానికి తెరపడింది. బీజేపీ ప్రభుత్వ కాలంలో పాఠ్యపుస్తకాల్లో చేర్చిన కొన్ని పాఠ్యాంశాలను ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే మారుస్తామని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి మధుబంగారప్ప ఇటీవల ప్రకటించారు. ఇదే విషయమై పాఠ్యపుస్తకాల పరిష్కరణ కమిటీ అధ్యక్షుడు, సాహితీవేత్త బరుగూరు రామచంద్రప్పతోను చర్చించారు. ఇప్పటికే విద్యాసంవత్సరం ప్రారంభం కాగా ఏఏ పాఠ్యాంశాలు తొలగిస్తారో, వేటిని విద్యార్థులకు బోధించాలో అనేది తర్జనభర్జనగా సాగుతుండేది. అయితే సీఎం సిద్దరామయ్య తాజాగా ప్రస్తుత విద్యాసంవత్సరంలో పాఠ్యాంశాల మార్పు ఉండదని తేల్చిన మేరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా కొన్ని పాఠాలను ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే బోధించకుండా ప్రత్యేక సర్క్యులర్‌ను జారీ చేయాలని నిర్ణయించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ చంద్రశేఖర్ కంబార ప్రస్తుత పరిస్థితులపై చర్చలు జరిపిన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Updated Date - 2023-06-15T12:32:10+05:30 IST