ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chief Minister: సీఎం సిద్దరామయ్య ఆసక్తికర కామెంట్స్.. కుమారస్వామి రాజకీయాల్లో ఓ విలన్‌

ABN, First Publish Date - 2023-10-26T10:26:40+05:30

రాష్ట్ర రాజకీయాల్లో జేడీఎస్‌ నేత కుమారస్వామి ఓ విలన్‌లా మారారని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah)

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజకీయాల్లో జేడీఎస్‌ నేత కుమారస్వామి ఓ విలన్‌లా మారారని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) వ్యాఖ్యానించారు. మైసూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహాభారతంలోని విలన్లతో కుమారస్వామి తనను పోలుస్తూ ట్వీట్లు చేయడంపై ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ప్రజలు కరువుతో అలమటిస్తుంటే తాను క్రికెట్‌ ఆట చూస్తూ వినోదంగా గడిపానన్న కుమారస్వామి వ్యాఖ్యలు ఆయన దిగజారుడు రాజకీయాలకు సంకేతమన్నారు. గతంలో కాంగ్రెస్-జేడీఎస్‌(Congress-JDS) సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన వేళ ఒక వారం అమెరికాలో, నెలలకొద్దీ తాజ్‌ వెస్టెండ్‌ పంచతార హోటల్లో గడిపిన కుమారస్వామి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడానికి తాను కారణం కాదని, బీజేపీ ఆపరేషన్‌ కమల కారణంగానే ప్రభుత్వం పతనమైందన్న సంగతి శాసనసభ సమావేశాల రికార్డులో పదిలంగా ఉందని, అవసరమైతే ఒకసారి చదువుకోవాలని ఆయన కుమారస్వామికి సవాల్‌ విసిరారు. శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో జేడీఎస్‌ ఇటు కింగ్‌ కాలేక అటు కింగ్‌మేకర్‌ కాలేకపోవడంతో కుమారస్వామిలో తీవ్రస్థాయిలో నిరాశ, నిస్పృహలు ఆవహించినట్టు కనిపిస్తోందన్నారు. బీజేపీకంటే జేడీఎ్‌సలోనే ఈ తీవ్రత అధికంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు రాష్ట్రం నుంచి నిధులు వెల్లువెత్తుతున్నాయన్న ప్రతిపక్షాల ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఆయన దమ్ముంటే నిరూపించాలని సవాల్‌ విసిరారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సింగిల్‌ డిజిట్‌ స్థానాలు కూడా దక్కవనే భయంతోనే బీజేపీ నేతలు తమ ప్రభుత్వంపై అవాకులు, చవాకులు పేలుతున్నారన్నారు. ప్రజలకు అన్ని విషయాలు బాగా తెలుసునని అన్నారు. సరైన సమయంలో ప్రతిపక్షాల నోళ్లు మూయించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

Updated Date - 2023-10-26T10:26:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising