ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chief Minister: సీఎం సిద్దరామయ్య ఆసక్తికర కామెంట్స్.. గ్యారెంటీలతో రాష్ట్రం దివాళా తీయదు

ABN, First Publish Date - 2023-08-06T12:41:53+05:30

పేదల సంక్షేమం కోసం తాము అమలు చేస్తున్న ఐదు గ్యారెంటీలతో రాష్ట్రం దివాళా తీయబోదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య

- ప్రధాని చర్యలతోనే ఆ పరిస్థితి

- ముఖ్యమంత్రి సిద్దరామయ్య

- దేశమంతటా ప్రశంసలు: ఖర్గే

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): పేదల సంక్షేమం కోసం తాము అమలు చేస్తున్న ఐదు గ్యారెంటీలతో రాష్ట్రం దివాళా తీయబోదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) స్పష్టం చేశారు. ప్రతి పేద కుటుంబానికి ఆర్థికంగా చేయూత ఇవ్వనున్నామని, అన్నభాగ్య ద్వారా ఇంటిల్లిపాదికి ఉచిత బియ్యం ఇస్తామని తెలిపారు. కలబురగిలో గృహజ్యోతికి శనివారం ఆయన శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Congress President Mallikarjuna Kharge, Deputy Chief Minister DK Shivakumar), మంత్రులు కేజే జార్జ్‌, ప్రియాంక ఖర్గే, శరణుప్రకాశ్‌ పాటిల్‌, ఈశ్వర్‌ఖండ్రె, దర్శనాపుర, రహీంఖాన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ బడ్జెట్‌లో కేటాయింపులకు అనుగుణంగానే పథకాలను అమలు చేస్తామన్నారు. కానీ ప్రధానమంత్రి నరరేంద్రమోదీ పాలనలో దేశం దివాళా తీసిందన్నారు. కర్ణాటకలో గ్యారెంటీ పథకాలతో ఖజానా ఖాళీ అయిందని ప్రధాని రాజస్థాన్‌లో విమర్శించారని మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యారెంటీ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. శక్తి గ్యారెంటీతో ప్రతిరోజూ 55 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. బీజేపీ నేతలు గ్యారెంటీ పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. దేశ సంపదను ఎవరు లూటీ చేశారని ప్రశ్నించారు. నిత్యావసర ధరలు, అవినీతి, నిరుద్యోగ సమస్య, పేదరికం, రైతులు, కార్మికులతోపాటు అన్ని వర్గాలకు బీజేపీ అన్యాయం చేసిందన్నారు. 2013 నుంచి 2018 మధ్య 165 హామీలకుగాను 158 అమలు చేశామన్నారు. వీటితోపాటు అదనంగా మరో 30 సంక్షేమాలను తీసుకొచ్చామని, మమ్మల్ని నమ్మినవారు మరోసారి అధికారం ఇచ్చారన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు.

విద్యుత్‌శాఖ మంత్రి కేజే జార్జ్‌ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 1.41 కోట్లమంది గృహజ్యోతికి దరఖాస్తు చేసుకున్నారని, జూలై నుంచి అమలులోకి తెచ్చామని అందరికీ జీరో బిల్లులు ఇస్తున్నామన్నారు. ఆగస్టులో నమోదు చేసుకునేవారికి సెప్టెంబరు నుంచి వర్తిస్తుందన్నారు. గృహజ్యోతి దరఖాస్తులకు గడువు లేదని, నిరంతరంగా చేసుకోవచ్చునని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు గ్యారెంటీలకు దేశమంతటా ప్రశంసలు లభిస్తున్నాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఇటీవలే హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి కలిశారని, ఐదు గ్యారెంటీల గురించి అడిగి తెలుసుకున్నారని వివరించారు. దేశమంతటా పార్టీ కార్యక్రమాల కోసం పర్యటిస్తున్నానని, ప్రతిచోటా గ్యారెంటీల అంశం ప్రస్తావిస్తున్నా అన్నారు. డీసీఎం డీకే శివకుమార్‌ మాట్లాడుతూ ఈ ఏడాది జనవరి 11న ప్రజాధ్వని యాత్ర ప్రారంభించామని, ప్రజల కన్నీరు తుడిచేందుకు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చామన్నారు. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో గ్యారెంటీలు సామాన్యులకు అండగా ఉన్నాయని చెప్పారు. కాగా గృహజ్యోతి ఆరంభానికి కలబురగి, బీదర్‌, రాయచూరుతోపాటు సమీప జిల్లాలకు చెందిన వేలాదిమంది పార్టీ కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. వారికి బస్సు సౌకర్యంతోపాటు సభా ప్రాంగణంలోనే భోజన వ్యవస్థ కల్పించారు. కాంగ్రె్‌సకు చెందిన ఎమ్మెల్యే అజయ్‌సింగ్‌ గైర్హాజరయ్యారు. మాజీ సీఎం ధరంసింగ్‌ కుమారుడు, ఇదే జిల్లా జేవర్గి, ఎమ్మెల్యే అజయ్‌సింగ్‌ సభకు దూరంగా ఉండడం చర్చనీయాంశమయింది. కా ర్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎన్‌వై పాటిల్‌, బీఆర్‌ పాటిల్‌, అల్లమప్రభు పాటిల్‌, ఖనీజ్‌ ఫాతిమా, చెన్నారెడ్డి తున్నూర, రాజా వెంకటప్ప నాయక్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-06T12:41:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising