ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chief Minister: సీఎం సిద్దరామయ్య సంచలన కామెంట్స్.. నా శవం కూడా అటువైపు...

ABN, First Publish Date - 2023-09-12T11:03:48+05:30

‘నా శవం కూడా బీజేపీ వైపు వెళ్లదు’ అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) మండిపడ్డారు.

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ‘నా శవం కూడా బీజేపీ వైపు వెళ్లదు’ అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) మండిపడ్డారు. మైసూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ జీవనమే సెక్యులరిజం భావాలు కలిగినదని పేర్కొన్నారు. మతతత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే వచ్చానని చెప్పారు. సిద్దరామయ్య గతంలో బీజేపీలో చేరేందుకు ప్రయత్నించారని జేడీఎస్‌ నేత కుమారస్వామి(JDS leader Kumaraswamy) చేసిన వ్యాఖ్యలపై సీఎం తీవ్రంగా స్పందించారు. ఆరంభం నుంచి నేటి దాకా తన రాజకీయ ప్రస్థానమంతా సెక్యులర్‌ భావాలతోనే కొనసాగిందని తెలిపారు. ఇటీవల ఢిల్లీలో అమిత్‌షాను కలిశానని, అంతమాత్రాన బీజేపీలో చేరేందుకు ప్రయత్నించినట్లేనా అన్నారు. ఎవరో చెబితే అదే అంశంపైనే కుమారస్వామి ఆరోపణలు చేస్తుంటారన్నారు. కుమారస్వామి తమ కుటుంబ రాజకీయాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో ఇప్పటికే 62 తాలూకాలను కరువు ప్రాంతాలుగా గుర్తించామని, ఇంకా 136 తాలూకాలకు సంబంధించి నివేదికలు కోరామని తెలిపారు. వాటిని పరిశీలించి మరో నాలుగైదు రోజుల్లోనే కరువు తాలూకాలను ప్రకటిస్తామన్నారు. కావేరీ నీటి ప్రాధికార సూచనలకు అనుగుణంగా తమిళనాడుకు నీరు విడుదల చేయాల్సి వచ్చిందన్నారు. ఇన్ని నీతులు చెప్పే బీజేపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు మేకెదాటుకు ఎందుకు అనుమతులు సాధించలేదని నిలదీశారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది ప్రాక్టికల్‌గా సాధ్యం కాదన్నారు. కర్ణాటకలో ఇటీవలే ఎన్నికలు ముగిశాయని, మరో ఏడాదిలో లోక్‌సభ ఎన్నికలు రానున్నాయని, రెండూ ఒకేసారి అంటే ఎలాగన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలుపు కేంద్రప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు.

Updated Date - 2023-09-12T11:03:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising