ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chief Minister: మేఘమథనంపై సీఎం సంచలన కామెంట్స్.. అది ఎక్కడా విజయవంతం కాలేదుగా..

ABN, First Publish Date - 2023-08-29T09:39:28+05:30

మేఘమథనం ఎక్కడా విజయవంతమైన దాఖలు లేవని, రాష్ట్రంలో అమలు చేయాలనే ఆలోచన కూడా లేదని

- త్వరలోనే కరువు తాలూకాలు ప్రకటిస్తాం: సీఎం

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): మేఘమథనం ఎక్కడా విజయవంతమైన దాఖలు లేవని, రాష్ట్రంలో అమలు చేయాలనే ఆలోచన కూడా లేదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) స్పష్టం చేశారు. సోమవారం మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖరీఫ్‌ ప్రారంభం నుంచి సంతృప్తికర వర్షాలు పడలేదన్నారు. దీంతో పంటల సాగు అనుకున్నంత స్థాయిలో జరగలేదన్నారు. దాదాపు రాష్ట్రమంతటా కరువు ఛాయలు అలుముకున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో త్వరలోనే కరువు తాలూకాలను ప్రకటిస్తామన్నా రు. వర్షాధారంతో పాటు పంటల సాగుకు సంబంధించి స్పష్టమైన గణాంకాలు సేకరిస్తున్నామని, వాటి ఆధారంగానే కరువు తాలూకాలను ప్రకటిస్తామని చెప్పారు. ఇవే నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని పేర్కొన్నారు. వర్షం కురవలేదని మేఘమథనం నిర్వహించలేమన్నారు. ఇప్పటి దాకా మేఘమథనం ద్వారా బాగా వర్షాలు కురిసిన దాఖలాలు లేవని చెప్పారు. రాష్ట్రంలో మేఘమథనం జరిపే విషయంపై ఎక్కడా చర్చలు జరగలేదన్నారు. కరువు తాలూకాలు ప్రకటించాక ఉపాధి పనిదినాలు పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2023-08-29T09:39:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising