ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chief Minister: అప్పులు చేసి ఆడంబర వివాహాలు వద్దు...

ABN, First Publish Date - 2023-09-28T11:12:08+05:30

భారీగా అప్పులు చేసి ఆడంబర వివాహాల జోలికెళ్ళవద్దని ప్రజలకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) సూచించారు. చామరాజనగర జిల్లాలోని మలై మహదేశ్వరస్వామి క్షేత్రాభివృద్ధి ప్రాధికార ఆధ్వర్యంలో

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): భారీగా అప్పులు చేసి ఆడంబర వివాహాల జోలికెళ్ళవద్దని ప్రజలకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) సూచించారు. చామరాజనగర జిల్లాలోని మలై మహదేశ్వరస్వామి క్షేత్రాభివృద్ధి ప్రాధికార ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటైన సామూహిక సరళ వివాహాల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన పేదలు, మధ్యతరగతి వర్గాల పాలిట ఆండబర వివాహాలు పెనుభారంగా మారుతూ జీవితాంతం అప్పులు చెల్లించాల్సిన దుర్భర పరిస్ధితి ఏర్పడుతోందన్నారు. నిరాడంబర వివాహాలపై ప్రజల్లో జాగృతి పెరగాలని ఆయన ఆకాంక్షించారు. వ్యవసాయం కోసం అప్పులు చేయడంలో తప్పులేదు... అయితే ఆడంబర వివాహాల కోసం మాత్రం వద్దేవద్దని సీఎం సూచించారు. మహదేశ్వర కొండల ప్రదేశం ఆధ్యాత్మిక ప్రాధాన్యం మెండుగా ఉన్న పుణ్యక్షేత్రమని ఇక్కడ అందరూ సమానమేనని అందుకే ఈ పుణ్యక్షేత్రమంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. తాను తొలిసారి సీఎంగా పగ్గాలు చేపట్టిన సమయంలో మలె మహదేశ్వర అభివృద్ధి ప్రాధికారను ఏర్పాటు చేసిన సంగతిని ఆయన గుర్తుచేశారు. ప్రాధికార ఏర్పాటయ్యాక ఈ క్షేత్రం ఆ దాయం కూడా గణనీయంగా పెరిగిందన్నారు.

ప్రత్యేకించి మహిళాభ క్తులు అత్యధిక సంఖ్యలో ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తున్నారని సీఎం పేర్కొన్నారు. రానున్న ఐదేళ్ళలో ఈ పుణ్యక్షేత్రం రూపురేఖల్నే మార్చివేసే దిశలో పలు కార్యక్రమాలను చేపట్టబోతున్నట్లు సీఎం ప్రకటించారు. పుణ్యక్షేత్రంలో తాగునీటికి, స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా ప్రాధికార అధికారులకు సీఎం సూచించారు. మలె మహదేశ్వర కొండలపై ఉన్న రాష్ట్రపతి భవన పేరును తపోభవనగా మారిందని ఆయన పేర్కొన్నారు. మాదేశ్వర తపస్సు చేసిన ఈ శక్తికేంద్రాన్ని శివరాత్రి దేశీకేంద్ర మహాస్వామి సూచన మేరకు పేరు మార్చడం జరిగిందన్నారు. జగద్గురు శివరాత్రి దేశీకేంద్ర మహాస్వామి సాన్నిథ్యంలో జరిగిన ఈ సామూహిక వివాహవేడుకల కార్యక్రమంలో పట్టద గురుస్వామి, శాంతమల్లికార్జున స్వామి, హనూరు ఎమ్మెల్యే ఎంఆర్‌ మంజునాథ్‌, పశుసంవర్ధక శాఖా మంత్రి కే వెంకటేష్‌, సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి హెచ్‌సీ మహదేవప్ప, రవాణా శాఖా మంత్రి ఆర్‌ రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-28T11:12:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising