ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chief Minister: ఆయనకు వరుణలో వణుకు ప్రారంభమైంది..

ABN, First Publish Date - 2023-04-21T10:59:24+05:30

వరుణలో ఆయనకు వణుకు ప్రారంభయైందని ముఖ్యమంత్రి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారానికి విచ్చేస్తారని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై(Chief Minister Basavaraja Bommai) ప్రకటించారు. బెంగళూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం యడియూరప్ప(Yeddyurappa) అధ్యక్షతన ఇటీవల జరిగిన లింగాయత్‌ నేతల కీలక సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని ప్రత్యేకించి బీజేపీ అధికారంలోకి వస్తే లింగాయత్‌లకే సీఎం పట్టం అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. కనకపురలో మిలటరీ హోటల్‌కు వచ్చి కడుపునిండా భోజనం చేసి వెళ్ళాలంటూ తమ పార్టీ అభ్యర్ధి రెవెన్యూ శాఖా మంత్రి ఆర్‌. అశోక్‌(Minister R. Ashok)ను ఉద్దేశించి కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌(DK Shivakumar) పరిహాసం చేయడాన్ని ప్రస్తావిస్తూ సామాన్య ప్రజలు అధికంగా వచ్చే మిలటరీ హోటల్‌ నుంచే బీజేపీ ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుందన్నారు. టికెట్లు రాకపోవడంతో వలస వెళ్ళిన నేతలను తిరిగి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. లింగాయత్‌ను కాంగ్రెస్‌ మొదటి నుంచి అన్యాయం చేస్తూనే వచ్చిందన్నారు. 1967 నుంచి ఇంతవరకు గత ఐదుశాబ్దాల కాలంలో కనీసం ఒక్క లింగాయత్‌ నేతను పూర్తి కాలానికి సీఎం చేయలేదన్నారు. వీరేంద్రపాటిల్‌ను కేవలం 9 నెలలకే అత్యంత అవమానకరమైన రీతిలో సాగనంపార న్నారు. లింగాయత్‌ ఓటు బ్యాంకు పదిలంగా ఉందని ఒకరిద్దరు నేతలు పార్టీ వీడినంత మాత్రాన వచ్చే నష్టమేమీలేదని సీఎం అన్నారు. వరుణలో సిద్ధరామయ్యకు వణుకు ప్రారంభమైందన్నారు. ఇంతకాలం లోపాయకారి రాజకీయాలపై మాట్లాడుతూ వచ్చిన ఆయన వరుణలోనూ ఇలాంటిదేదో జరుగుతుందని భయపడుతున్నారని కాంగ్రె్‌సలో నేతల మధ్యఉన్న కుమ్ములాటలను ఇది సంకేతమన్నారు.

Updated Date - 2023-04-21T12:03:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising