Chief Minister: బాలుడికి డెంటల్ సర్జరీ చేసిన ముఖ్యమంత్రి
ABN, First Publish Date - 2023-01-11T19:06:51+05:30
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక డాక్టర్ వృత్తికి ఆయన దూరంగా ఉంటూ వచ్చారు.
అగర్తల: త్రిపుర ముఖ్యమంత్రి (Chief Minister of Tripura) మాణిక్ సాహా (Dr Manik Saha) ఓ బాలుడికి డెంటల్ సర్జరీ (Dental Surgery)చేశారు. 7 నెలల క్రితం ఆయన త్రిపుర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక డాక్టర్ వృత్తికి ఆయన దూరంగా ఉంటూ వచ్చారు. హపియానాలోని త్రిపుర మెడికల్ కాలేజీలో గతంలో ఆయన డాక్టర్‌గా పనిచేసేవారు. మళ్లీ అదే క్యాంపస్‌లో అడుగుపెట్టిన ముఖ్యమంత్రి పదేళ్ల బాలుడికి సర్జరీ చేశారు. సర్జరీ విజయవంతమైంది. సర్జరీ టీమ్‌లో ముఖ్యమంత్రితో పాటు డాక్టర్ అమిత్ లాల్ గోస్వామి డాక్టర్ పూజీ దేబ్‌నాథ్, డాక్టర్ రుద్ర ప్రసాద్ చక్రవర్తి, డాక్టర్ స్మితా పాల్, డాక్టర్ కంచన్ దాస్ తదితరులున్నారు. చాలా గ్యాప్ తర్వాత చేసినా సర్జరీ విజయవంతమైందని ముఖ్యమంత్రి సాహా తెలిపారు.
త్రిపురలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. చాలా కాలంగా అధికారంలో ఉన్న వామపక్షాలను 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. 60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లీలో బీజేపీ 36 స్థానాలను కైవసం చేసుకుంది. బిప్లవ్ దేవ్ ఇటీవలి వరకూ సీఎంగా కొనసాగారు. 7 నెలల క్రితం బిప్లవ్ దేవ్‌ను తప్పించి మాణిక్ సాహాను బీజేపీ ముఖ్యమంత్రిగా చేసింది. త్వరలో ఎన్నికలు జరగనుండటంతో సీఎం పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
Updated Date - 2023-01-11T19:33:38+05:30 IST