ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chief Minister: కాస్త ఓపిక పట్టండయ్యా ప్లీజ్‌..

ABN, First Publish Date - 2023-08-08T11:38:51+05:30

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికార పగ్గాలు చేపట్టిన రెండు నెలలకే సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి రగిలిపోతుండడం, మంత్రులు, ఎమ్మెల్యేల

- ఆరు జిల్లాల ప్రజాప్రతినిధులతో సీఎం సమీక్ష

- అభివృద్ధిలో రాజకీయాలకు చోటు ఉండదని స్పష్టీకరణ

- నిధులు కేటాయిస్తామని హామీ

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికార పగ్గాలు చేపట్టిన రెండు నెలలకే సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి రగిలిపోతుండడం, మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య అగాధం పెరుగుతున్న తరుణంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Chief Minister Siddaramaiah and Deputy Chief Minister DK Shivakumar) దిద్దుబాటు చర్యలకు దిగారు. అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రక్రియ చేపట్టారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోమవారం తన అన్ని అధికారిక కార్యక్రమాలను పక్కనపెట్టి తొలిదశలో ఆరు జిల్లాల ఇన్‌చార్జ్‌ మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించారు. ఉదయం తుమకూరు, యాదగిరి, చిత్రదుర్గ జిల్లాల ఎమ్మెల్యేలతోనూ, సాయంత్రం బాగల్కోటె, బళ్లారి, ధారవాడ జిల్లాల ఎమ్మెల్యేలతో సుమారు 8 గంటలపాటు సుదీర్ఘ చర్చలు జరిపారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను సావధానంగా ఆలకించిన సీఎం, డీసీఎం అనేక పాయింట్లను నోట్‌ చేసుకున్నారు. ఇకపై ప్రతినెలా పార్టీ ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చి వారితో టచ్‌లో ఉంటామని సీఎం, డీసీఎం ప్రకటించిన తర్వాత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఒకింత శాంతించారు. మొదటి రోజు 31 మంది ఎమ్మెల్యేల తో భేటీ సమావేశాలు నిర్వహించగా.. మంగళవారం ఈ సమావేశాలు కొనసాగుతాయని తెలుస్తోంది.

కాస్త ఓపిక పట్టండి ప్లీజ్‌

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఐదు గ్యారెంటీ పథకాల అమలుకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ అధిష్టానం కూడా స్పష్టమైన సూచనలు చేసిందని, ఈ కారణంగా అభివృద్ధి పనులకు నిధుల సర్దుబాటు ఒకింత సమస్యగా ఉన్న మాట నిజమేనని సీఎం సిద్దరామయ్య అంగీకరించారు. కాస్త ఓపిక పట్టాలని ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు. మంత్రులందరికీ తగిన సూచనలు చేశామని, ఎమ్మెల్యేలతో భేటీ కావడంతోపాటు నియోజకవర్గాల అభివృద్ధి, అత్యవసర పనులు, ముఖ్యమైన బదిలీల విషయంలో ఎలాంటి సమస్య లేకుండా చూస్తామని సీఎం హామీ ఇవ్వడం ద్వారా ఎమ్మెల్యేలను బుజ్జగించినట్టు తెలుస్తోంది. జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రులు స్థానిక పార్టీ ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సమావేశంలో సీఎం సూచించారు. జిల్లాల వారీగా ఈ సమావేశాలు జరగడం విశేషం. తొలుత ముఖ్యమంత్రి తుమకూరు(Tumakuru) జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి డాక్టర్‌ జి. పరమేశ్వర్‌ సారథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అనంతరం యాదగిరి జిల్లా సుధాకర్‌ సారథ్యంలో ఎమ్మెల్యేలు సీఎంతో సమావేశమై తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఎమ్మెల్యేల ప్రతి సమస్యను స్వయంగా ఆలకించడం ద్వారా వారిలో విశ్వాసాన్ని రేకెత్తించే ప్రయత్నం చేశారు. సాయం త్రం జరిగిన సమావేశంలో బళ్లారి జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి బీ నాగేంద్ర సారథ్యంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు తుకారాం, జీఎన్‌ గణేశ్‌, నారా భరత్‌రెడ్డి, డీఎం నాగరాజ్‌ పాల్గొన్నారు. ఆరు జిల్లాల సమావేశాల్లోనూ ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి గోవిందరాజ్‌ పాల్గొన్నారు.

సమన్వయ కమిటీ ప్రస్తావన లేదు

ప్రభుత్వం సజావుగా సాగేందుకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని 40మందికి పైగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేస్తున్నట్టు మీడియాలో వెలువడిన వదంతులు నిరాధారమని సమావేశం అనంతరం ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కూడా కాకముందే ప్రతిపక్ష బీజేపీ వదంతులు, దుష్ప్రచారాలకు తెరలేపిందని ఆయన మండిపడ్డారు. గ్యారెంటీ పథకాలతోపాటు అభివృద్ధి పనులకు సముచిత ప్రాతినిధ్యం ఉంటుందన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కాంట్రాక్టర్లకు రూ.1000 కోట్లకు పైగా బిల్లుల బకాయి ఉండగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో రూ.170 కోట్లు మాత్రమే బకాయి ఉందన్నారు.

అభివృద్ధిలో రాజకీయాలకు చోటు ఉండదు : సీఎం

అభివృద్ధిలో రాజకీయాలకు చోటు ఉండదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) స్పష్టం చేశారు. జిల్లాల్లో అభివృద్ధి పనులను వేగిరం చేసే ఉద్దేశ్యంతోనే జిల్లాలవారీగా ఇన్‌చార్జ్‌ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల సమావేశాన్ని తొలిదశలో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశాలకు ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను ఆహ్వానించకపోవడం వెనుక ఎలాంటి రాజకీయం లేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వ హయాంలోనూ ఇదే సంప్రదాయం కొనసాగిందని ఆయన గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గాలకు భారీగా నిధులు విడుదల చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలను నిర్లక్ష్యం చేశారని సీఎం పేర్కొన్నారు. తాము ఇలాంటి దిగుజారుడు రాజకీయాలు చేయబోమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేల్లో ఎలాంటి అసంతృప్తి లేదని సీఎం స్పష్టం చేశారు.

Updated Date - 2023-08-08T11:38:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising