ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chief Minister: ఎక్స్‌ప్రెస్‌ వే అదనపు పనులకు రూ.158 కోట్లు

ABN, First Publish Date - 2023-07-30T12:13:52+05:30

బెంగళూరు - మైసూరు మధ్య నిర్మించిన ఎక్స్‌ప్రెస్‌ వే మార్గంలో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్న తరుణంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య(

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బెంగళూరు - మైసూరు మధ్య నిర్మించిన ఎక్స్‌ప్రెస్‌ వే మార్గంలో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్న తరుణంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) శనివారం పరిశీలించారు. ఈ మేరకు అదనపు పనుల కోసం రూ.158.81 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. వర్షాకాలం ముగిశాక పనులు ప్రారంభమవుతాయన్నారు. ఎక్స్‌ప్రెస్‌ వే రోడ్డు(Expressway Road) పరిశీలనలో భాగంగా మండ్య వద్ద సీఎం మీడియాతో మాట్లాడారు. ఈ మార్గంలో స్పీడ్‌ డిటెక్టర్లను ఏర్పాటు చేశామన్నారు. జూన్‌ దాకా ప్రమాదాలు జరిగాయని, ఇటీవల స్పీడ్‌ డిటెక్టర్ల ఏర్పాటుతో తగ్గుముఖం పట్టాయన్నారు. ప్రతి పది కిలో మీటర్లకు ఒకచోట స్పీడ్‌ డిటెక్టర్లను ఏర్పాటు చేయడం ద్వారా నిరంతరంగా వాహనాల పర్యవేక్షణ ఉంటుందని, తద్వారా పరిమితి వేగంతో నడుస్తాయన్నారు. చీఫ్‌ సెక్రటరీ, నేషనల్‌ హైవే అథారిటీ అధికారులతో సమావేశం నిర్వహించామన్నారు. త్వరలోనే హైవే అథారిటీ అధికారులో సమీక్ష జరుపుతానని చెప్పారు. సర్వీసు రోడ్లను ఏర్పాటు చేసేందుకు కేంద్రానికి లేఖ పంపామని తెలిపారు. బిడది, రామనగర, చెన్నపట్టణ, మద్దూరు, మండ్య, శ్రీరంగపట్టణ బైపా్‌సలలో పనులు చేపడతామన్నారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరితో టోల్‌ వసూలు అంశంపై చర్చిస్తామన్నారు. రోడ్డు పనులు పూర్తి కాకుండానే టోల్‌ వసూలు చేస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తానని పేర్కొన్నారు. ఉడుపి కళాశాల సంఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని, సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మంత్రి చలువరాయస్వామి, ట్రాఫిక్‌ ఏడీజీపీ అలోక్‌కుమార్‌ తదితర అధికారులు ఉన్నారు.

Updated Date - 2023-07-30T12:13:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising