Chief Minister: ఉద్యోగులకు సిద్దూ ప్రభుత్వం బంపరాఫర్.. అదేంటో తెలిస్తే..
ABN, First Publish Date - 2023-06-14T11:15:28+05:30
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్)ను
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్)ను రద్దు చేస్తామని, కేబినెట్‌లో చర్చించి ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ను అమలు చేసే విషయం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు మంగళవారం సీఎం సిద్దరామయ్యను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేబినెట్‌లో ఎన్‌పీఎస్ రద్దు నిర్ణయం తీసుకుని వచ్చే బడ్జెట్‌లో ఓపీఎస్‌ను పొందుపరుస్తామన్నారు. ఇదే సందర్భంగా మాజీ ఎంపీ ఉగ్రప్ప మాట్లాడుతూ 2006 ఏప్రిల్ నుంచి ఎన్‌పీఎస్ అమలులోకి వచ్చిందన్నారు. పెన్షన్‌ను ఎన్‌ఎస్‌డీఎల్‌లో డిపాజిట్లు చేసి ఈ మొత్తాన్ని రిటైర్మెంట్ నాటికి జీపీఎణ్లో కలుపుతామన్నారు. ఓట్ ఫర్ ఓపీఎస్‌లో పాల్గొన్నవారిపై క్రమశిక్షణా చర్యలు రద్దు చేయాలని సూచించారు. రాజస్థాన్, చత్తీస్‌ఘడ్‌లో ఎన్‌పీఎస్ రద్దు అయిందన్నారు. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల సంఘం, కేపీటీసీఎల్, వైద్య ఆరోగ్యం, జలమండలి, రెవెన్యూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎంను కలసినవారిలో ఉన్నారు.
Updated Date - 2023-06-14T11:15:31+05:30 IST