ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chief Minister: సామాజిక న్యాయమే నా ఊపిరి.. రాజ్యాంగ హక్కుల కోసం పోరాటం

ABN, First Publish Date - 2023-10-04T13:00:29+05:30

సామాజిక న్యాయమే తన ఊపిరి అని, అన్ని మతాలు, కులాలకు సమన్యాయమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) పేర్కొన్నారు.

- అన్ని సముదాయాలు సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలి

- ముఖ్యమంత్రి సిద్దరామయ్య

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): సామాజిక న్యాయమే తన ఊపిరి అని, అన్ని మతాలు, కులాలకు సమన్యాయమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) పేర్కొన్నారు. బెళగావిలోని జిల్లా క్రీడామైదానంలో మంగళవారం షెప్పర్డ్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ 9వ జాతీయ సదస్సులో పాల్గొన్నారు. తొలుత ముఖ్యఅతిథిగా హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ(Haryana Governor Bandaru Dattatreya) హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులను ఉద్దేశించి సీఎం సిద్దరామయ్య ప్రసంగిస్తూ రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు అన్ని మతాలు, కులాలకు అందాలని సమాజ్‌వాదీ నేత రామ్‌మనోహర్‌ లోహియా పదే పదే చెప్పేవారని గుర్తు చేశారు. రాజ్యాంగ హక్కులను పోరాడి సాధించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కుల వ్యవస్థకు తాను వ్యతిరేకమన్నారు. నేటికీ సమాజంలో అణగారిన వర్గాలు, పీడిత వర్గాలు హక్కులు పొందలేక వంచితులుగా ఉన్నారని ఆవేదన చెందారు. ప్రతి మతానికి, కులానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉందని, కురుబ కులానికి కూడా గొప్ప చరిత్ర ఉందన్నారు. హక్కబుక్కల కాలం నుంచి అహల్యాబాయి వంటి మహానేతలు ఈ కుల సంక్షేమానికి పాటుపడ్డారని తెలిపారు.

అన్ని సముదాయాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందితేనే సమసమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. తమ ప్రభుత్వం అందిస్తున్న 5 గ్యారెంటీలు సమాజంలోని అన్ని కులాలు, మతాలను ఐక్యంగా ముందుకు నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. వెనుకబడిన కులాలు, మైనార్టీల సంక్షేమానికి పూర్తి భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కాగినెలె గురుపీఠాధిపతి నిరంజనానందస్వామిజీ, ఈశ్వరానందపురి స్వామిజీ, సిద్దరామానందపురి స్వామిజీ, అర్జునాబాయిపురి స్వామిజీ సాన్నిథ్యంలో ఏర్పాటైన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సన్మానం తనపై బాధ్యతను మరింతగా పెంచిందని సీఎం పేర్కొన్నారు. ఇలాంటి చారిత్రాత్మక సమావేశ వేదికపై తనకు సన్మానం జరగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో షెప్పర్డ్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ అధ్యక్షుడు, మాజీ మంత్రి హెచ్‌. విశ్వనాథ్‌, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఫగ్గాన్‌సింగ్‌ కులాస్తె, రాష్ట్రమంత్రులు, లక్ష్మీ హెబ్బాళ్కర్‌, బైరతి సురేశ్‌, గోవా ఉపముఖ్యమంత్రి చంద్రకాంత్‌ బాబు కావలేకర్‌, మహారాష్ట్ర మాజీ మంత్రి మహదేవ్‌ జనకర్‌, మాజీ మంత్రి హెచ్‌ఎం రేవణ్ణ, ఆంధ్రప్రదేశ్‌ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్‌తోపాటు 60మందికిపైగా కురుబ నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-04T13:00:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising