ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chief Minister: మూడు గ్యారెంటీలు అమల్లోకి తెచ్చాం.. ఇంకా రెండే ఉన్నాయి..

ABN, First Publish Date - 2023-07-02T11:28:52+05:30

శాసనసభ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఐదు గ్యారెంటీ పథకాలకుగాను మూడు గ్యారెంటీలు అమల్లోకి వచ్చేశాయని ము

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- బీజేపీది పసలేని వాదన

- విరుచుకుపడ్డ సీఎం సిద్దరామయ్య

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): శాసనసభ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఐదు గ్యారెంటీ పథకాలకుగాను మూడు గ్యారెంటీలు అమల్లోకి వచ్చేశాయని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) ప్రకటించారు. బెంగళూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే శక్తి పథకం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా అమలవుతోందని, ఈ పథకానికి ఇంతవరకు సుమారు రూ.250 కోట్లు ఖర్చు అయిందన్నారు. ఈ భారం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థపై పడకుండా చూస్తామన్నారు. శనివారం నుంచే గృహజ్యోతి పథకం కూడా అమలులోకి వచ్చిందన్నారు. ఈ నెలంతా 200 యూనిట్ల వరకు ప్రజలు ఉచిత విద్యుత్‌ను అందుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించిన బిల్లులు ఆగస్టులో వస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వం మోకాలొడ్డినా కూడా అన్నభాగ్య పథకాన్ని కూడా ఈనెల నుంచి అమలులోకి తెచ్చామని పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు బియ్యం నిల్వలు అందుబాటులోకి వచ్చేంతవరకు ఈనెల 10 నుంచి ప్రజల ఖాతాలలోకి 5 కిలోలకుగాను రూ.170 జమ చేస్తామని చెప్పారు. జూలై 1 నుంచే అన్నభాగ్య మొత్తాన్ని ఖాతాల్లో జమ చేస్తామని తాను ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. జూలై నెలలో 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించుకునేవారు ఆగస్టు బిల్లులో ఎలాంటి మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు. కాగా కాంగ్రెస్‌ గ్యారెంటీ పథకాలపై బీజేపీ పసలేని ఆరోపణలు చేస్తోందని సీఎం విరుచుకుపడ్డారు. పేదలకు మేలు జరుగుతుంటే బీజేపీ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు.

త్వరగా దరఖాస్తు చేసుకోండి

గృహజ్యోతి పథకం శనివారం నుంచి అమలులోకి వచ్చిందని, ఉచిత విద్యుత్‌ పొందాలనుకునేవారంతా ఈ పథకం కోసం తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని విద్యుత్‌శాఖ మంత్రి కేజే జార్జ్‌ ప్రకటించారు. చిక్కమగళూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గృహజ్యోతి పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునేవారు దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి చివరి తేదీ లేదన్నారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం

మూడు గ్యారెంటీ పథకాలను అమలులోకి తీసుకురావడం ద్వారా శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్‌ గుండూరావు ప్రకటించారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్‌ చేశారు. శాసనసభ సమావేశాల్లో గ్యారెంటీ పథకాలపై ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామన్నారు. సాంకేతిక కారణాలతో గృహలక్ష్మి అమలులో కొద్దిగా వాయిదా పడిందని, ఆగస్టు 15 నుంచి అమలులోకి వస్తుందన్నారు. కాగా నిరుద్యోగ భృతి విషయంలోనూ ప్రభుత్వం ఇచ్చిన మాటను హామీని నిలబెట్టుకుంటుందన్నారు.

Updated Date - 2023-07-02T11:28:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising