ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chief Minister: నేడు ప్రధానిని కలుస్తా.. కరువుపై చర్చిస్తా..

ABN, Publish Date - Dec 19 , 2023 | 07:13 AM

రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వివరిస్తానని ముఖ్యమంత్రి సిద్దరామయ్య

- సీఎం సిద్దరామయ్య

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వివరిస్తానని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) వెల్లడించారు. సోమవారం నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ వెళ్తున్నానని, అక్కడే మూడు రోజులు ఉంటానని పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi)తో అపాయింట్‌మెంట్‌ ఉందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితిని సమగ్ర వివరాలతో వెల్లడిస్తానని చెప్పారు. రాష్ట్రానికి సంబంధించి పలు పెండింగ్‌ ప్రాజెక్టులు, గ్రాంట్ల వివరాలను ప్రధానమంత్రికి తెలుపుతానని పేర్కొన్నారు. వెంటనే కరువు సాయం విడుదల చేయాలని కోరనున్నట్టు తెలిపారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో పాల్గొంటానని వివరించారు. లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్‌ పెద్దలతో చర్చలు జరుపుతానన్నారు. అధిష్టానంతో బోర్డులు, కార్పొరేషన్ల నియామకాలపైనా ఒక ని ర్ణయం తీసుకుంటామన్నారు. పొరుగు రాష్ట్రాల్లో కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ప్రభావంపై ముందస్తు చర్య లు తీసుకుంటామన్నారు. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ మంత్రితో సమావేశం నిర్వహించి కొత్త గా మార్గదర్శకాలు తీసుకోవాలని ఆదేశించానన్నారు.

Updated Date - Dec 19 , 2023 | 07:13 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising