ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM, DCM: ఆయనకు నిరసన తెలిపే హక్కు కూడా ఉందా..: సీఎం

ABN, First Publish Date - 2023-06-25T11:28:11+05:30

అన్నభాగ్య పథకం అమలులో జాప్యంపై మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు నిరసన తెలిపే నైతికత ఉందా..? అని సీఎం సిద్దరామయ్య(

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మేమూ పోరాటాలు చేశాం... మాపైనా కేసులు పెట్టారు: డీసీఎం

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): అన్నభాగ్య పథకం అమలులో జాప్యంపై మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు నిరసన తెలిపే నైతికత ఉందా..? అని సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) ప్రశ్నించారు. శనివారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ పేదల కడుపు నింపే పథకానికి ఇబ్బంది కలిగిస్తున్నారని తెలిపారు. గోడౌన్లలో బియ్యపు నిల్వలు ఉన్నాయని, ప్రైవేట్‌ వ్యక్తులకు కేటాయిస్తున్నారని ఆరోపించారు. తామే ఉచితంగా కోరడం లేదని, అందుకు తగిన మొత్తం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఏ ఉద్దేశ్యంతో వారు నిరాకరించారో అర్థం కావడం లేదన్నారు. వీరిని ఏమని అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ఇలాంటి నాయకులు పేదల పక్షమా, వ్యతిరేకమా.. అని ప్రశ్నించారు. జూలై ప్రారంభం నుంచే అన్నభాగ్య పథకంలో పది కిలోల బియ్యం ఇస్తామని ప్రకటించామన్నారు. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) తొలుత సానుకూలం తెలిపినా ఆ తర్వాత వెనుకడుగు వేసిందన్నారు. ప్రత్యామ్నాయంగా బియ్యం సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. చత్తీస్ ఘడ్‌ నుంచి 1.5 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం కొనుగోలు చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం వడ్లు ఇచ్చేందుకు సానుకూలం తెలిపిందన్నారు. పంజాబ్‌ రాష్ట్రం నవంబరులో కోటా ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఎన్‌సీసీఎఫ్, కేంద్రీయ భండార, నాఫెడ్‌ నుంచి కూడా కొటేషన్లు కోరామన్నారు. ఓపెన్‌ మార్కెట్‌ నుంచి కొనుగోలు చేస్తామన్నారు. టెండర్లు పిలవాలంటే సమయం పడుతుందన్నారు. రాగులు, జొన్నలు కూడా 2కిలోల చొప్పున ఇవ్వవచ్చునని, అయినా 3 కిలోల బియ్యం అవసరం ఉందన్నారు. కాగా పాలధర పెంపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. వర్షం రెండురోజులుగా ప్రారంభమైందని, ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వర్షం కురవాలని దేవుడిని ప్రార్థిస్తామన్నారు. విత్తనాలు, ఎరువులు సమకూర్చామన్నారు. రాష్ట్ర పౌర ఆహార సరఫరాలశాఖ మంత్రి మునియప్ప దేవనహళ్లిలో మీడియాతో మాట్లాడుతూ కేంద్రం బియ్యం ఇచ్చేందుకు నిరాకరించిందని, కేంద్ర అనుబంధ సంస్థలతో కొనుగోళ్లకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రత్యామ్నాయ ప్రయత్నాలు కొనసాగిస్తున్నామన్నారు. యడియూరప్ప విధానసౌధలో ఆందోళన చేస్తాననే సవాల్‌పై ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief Minister DK Shivakumar) స్పందించారు. పోరాటం చేయడం తప్పు కాదని, తాము కూడా గతంలో చేశామని, తమపైనా కేసులు పెట్టారన్నారు. పరోక్షంగా నిరసనలకు దిగితే కేసులు తప్పవనే హెచ్చరించినట్టయింది.

Updated Date - 2023-06-25T11:28:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising