ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM, MLA: సీఎంకు ఎమ్మెల్యే లేఖ.. ఓ మంత్రికి పీఏ అయినా చేయండి..!

ABN, First Publish Date - 2023-07-29T11:36:50+05:30

ఎమ్మెల్యేలుగా నియోజకవర్గంలో ఎటువంటి పనులు చేయలేక పోతున్నామని, తమను నమ్ముకున్న ప్రజలకు హామీలు ఇచ్చే పరిస్థితి లేదని, మంత్రులు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేలుగా నియోజకవర్గంలో ఎటువంటి పనులు చేయలేక పోతున్నామని, తమను నమ్ముకున్న ప్రజలకు హామీలు ఇచ్చే పరిస్థితి లేదని, మంత్రులు స్పందించడం లేదంటూ 30 మంది ఎమ్మెల్యేలు(30 MLAs) ఏకంగా ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah)కు రాసిన లేఖ సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. పరిస్థితిని సర్దుబాటు చేసేందుకు గురువారం నిర్వహించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సమావేశంలో మరో లేఖ వెలుగు చూసింది. ఎమ్మెల్యేలుగా ఏ పనులూ చేయలేక పోతున్నామని, కనీసం మంత్రుల్లో ఒకరికి పీఏలుగానో, లేక పీఎ్‌సలుగానైనా నియమించాలంటూ రాసిన లేఖ చర్చనీయాంశమయింది. దావణగెరె(Davanagere) జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే రాసిన లేఖ విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. నియోజకవర్గంలో తాగునీరు, వర్షం సమస్యలు వచ్చినా పట్టించుకునేవారు లేకుండా పోయారని లేఖలో ప్రస్తావించారు. ప్రభుత్వం స్పందించడం లేదు... ప్రజలకు ముఖం చూపలేక పోతున్నాం.. ఎమ్మెల్యే పదవి కంటే ఓ మంత్రికి పీఏ గానో లేక ఓఎ్‌సడీగా నైనా చేయాలంటూ ప్రస్తావించడం ఎమ్మెల్యేలు నవ్వేలా చేసింది. కానీ రెండునెలల్లోనే ఎమ్మెల్యేలు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవాలని మంత్రులను సీఎం మందలించినట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-07-29T11:36:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising