ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM Siddaramaiah: సీఎం సిద్దరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. నేను సమర్థుడినే.. నన్నెవరూ దారి తప్పించలేరు

ABN, First Publish Date - 2023-07-15T10:57:47+05:30

‘నేను అన్నింటా సమర్థుడినే.. నన్నెవరూ దారి తప్పించలేరు.. ప్రతిపక్ష సభ్యులు ఎన్ని ప్రశ్నలు వేసినా సమాధానం చెప్పగలను’ అని ముఖ్యమంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ‘నేను అన్నింటా సమర్థుడినే.. నన్నెవరూ దారి తప్పించలేరు.. ప్రతిపక్ష సభ్యులు ఎన్ని ప్రశ్నలు వేసినా సమాధానం చెప్పగలను’ అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) తెలిపారు. శుక్రవారం విధానపరిషత్‌లో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మూడున్నర గంటలకుపైగా సీఎం వివరణ ఇచ్చారు. మూడున్నరేళ్ల బీజేపీ పాలనలో అవినీతి అక్రమాలు, నిత్యావసర ధరలు, మతతత్వ విధానాలకు ప్రజలు విసుగు చెందారని, ఇదే క్రమంలోనే కాంగ్రెస్‌ ద్వారా తాము ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలకు విశ్వాసం చూపారని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీకి ఎప్పుడూ స్పష్టమైన మెజారిటీ సాధ్యం కాలేదన్నారు. 2013 ఎన్నికల్లో 122 మంది, 2023 ఎన్నికల్లో 135 మందితో స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. యడియూరప్ప(Yeddyurappa) సారథ్యం వహించిన 2018లో వారికి దక్కింది 104 స్థానాలే అన్నారు. జేడీఎస్‌ పార్టీ సొంతంగా గెలవలేదని, భవిష్యత్తులోనూ గెలవదని ఎద్దేవా చేశారు. ఇటీవల ఎన్నికల్లో జేడీఎస్‌(JDS) పంచరత్న పథకాలంటూ ప్రజల్లోకి వెళ్లిందని, 123 స్థానాలు గెలవకపోతే పార్టీని రద్దు చేస్తామని కుమారస్వామి ప్రకటించారని గుర్తు చేశారు. కానీ వారికి దక్కింది కేవలం 13.30 శాతంతో 19 స్థానాలు మాత్రమే అన్నారు. జేడీఎస్‌ ఇచ్చిన మాటకు ఎప్పుడూ కట్టుబడదన్నారు. సుదీర్ఘకాలంపాటు జేడీఎస్‏లో కొనసాగానని, పార్టీ వ్యతిరేక కలాపాలకు పాల్పడ్డానని తరిమేశారని తెలిపారు. కాంగ్రెస్‏లో చేరాక రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యానన్నారు.

మోదీ ప్రచారం చేసిన ప్రతిచోటా కాంగ్రెస్‏దే విజయం

బీజేపీ రాష్ట్ర నేతలకు ప్రణాళికలుగానీ, అభివృద్ధి చేయాలనే రోడ్‌మ్యా్‌పగానీ లేదని, కేవలం వారు ప్రధానమంత్రి నరేంద్రమోదీని నమ్ముకున్నారని సీఎం ఎద్దేవా చేశారు. ఇటీవలి ఎన్నికల్లో ప్రధాని హోదాలో మోదీ 28 ప్రాంతాల్లో ప్రచారం చేశారని, ప్రతిచోటా కాంగ్రెస్‌ గెలిచిందన్నారు. నంజనగూడుకు వచ్చారని, అక్కడ కాంగ్రెస్‌ తిరుగులేని మెజారిటీ సాధించిందని తెలిపారు. ప్రధాని పాల్గొన్న ప్రాంతాల్లో 40వేలకు పైగానే మెజారిటీతో తమ అభ్యర్థులు గెలుపొందారన్నారు. ఉత్పత్తిని అవసరమైన వారికి పంచాల్సి ఉందన్నారు. అందుకే అన్నభాగ్య గ్యారెంటీ ద్వారా ఆకలి తీర్చే పథకం ప్రవేశపెట్టామన్నారు. నేటి సమాజంలోనూ బీజేపీ హిట్లర్‌లా వ్యవహరించిందని విరుచుకుపడ్డారు. జీఎస్టీ పేరిట సామాన్యుల జేబు నుంచి వారి కష్టపడ్డ సొమ్మును లాగేశారన్నారు. నిత్యావసరాలు, వంటగ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ వంటి ధరలు పెంచి అన్నివర్గాలకు భారం మోపారన్నారు.

ప్రతిపక్షనేతను ఎంపిక చేయలేని స్థితిలో బీజేపీ

ప్రతిపక్షనేతను ఎంపిక చేయలేని స్థితికి బీజేపీ చేరిందని సీఎం సిద్దరామయ్య విరుచుకుపడ్డారు. 1983 నుంచి శాసనసభలో ఉన్నానని, ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి రాలేదన్నారు. ప్రతిపక్షనేత రాజ్యాంగబద్ధమైన పదవి అన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్నారు. ఇందిరాగాంధీ కాలంలోనూ ఓటమి జరిగిందని, ఆ తర్వాత కాంగ్రెస్‌ తిరుగులేని మెజారిటీ సాధించిందన్నారు. ప్రతిపక్షనేత ఎంపిక విషయమై జగదీశ్‌ శెట్టర్‌ ప్రస్తావన సర్వత్రా వాగ్వాదానికి దారితీసింది. బీజేపీ అధిష్టానం ప్రతిపక్షనేతలను ఎంపిక చేసేదాకా పోటీలో ఉండే నలుగురైదుగురు పేర్లను చీటీలు వేసి లాటరీ పద్ధతిన సభాపతి ఎంపిక చేయాలని సలహా ఇచ్చారు. ఇందుకు బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దశాబ్దాలపాటు బీజేపీలో కొనసాగి పార్టీ మారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కోట శ్రీనివాసపూజారి సహా పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నెలలో 18 కోట్ల మంది ‘శక్తి’ ప్రయాణాలు

ఐదు గ్యారెంటీల్లో ఒకటైన మహిళల ఉచిత ప్రయాణం శక్తి గ్యారెంటీని జూన్‌ 11న ప్రారంభిస్తే జూలై 13నాటికి 18 కోట్ల మంది సద్వినియోగం చేసుకున్నారని సీఎం సిద్దరామయ్య తెలిపారు. సరాసరిన 49.60 లక్షల మంది మహిళలు ప్రయాణించారన్నారు. గతంలో రూ.24 కోట్లు రోజుకు ఆర్టీసీ ద్వారా ఆదాయం వచ్చేదని, ఇటీవల మహిళలతోపాటు పురుషుల ప్రయాణాలు పెరిగాయని తద్వారా రూ.28.72 కోట్లకు పెరిగిందన్నారు. త్వరలోనే 4వేల బస్సులు కొనుగోలు చేస్తామని, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లకు సంబంధించిన 13వేల పోస్టులు భర్తీ చేస్తామని, కొవిడ్‌ వేళ రద్దయిన రూట్లను పునరుద్ధరిస్తామన్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు, ధర్మస్థళ ధర్మాధికారి వీరేంద్రహెగ్డే లేఖను ప్రస్తావించారు. ఇటీవల మహిళలు ధర్మస్థళకు భారీగా వస్తున్నారని, హుండీలో ముడుపులు వేస్తున్నారని ముఖ్యమంత్రి సిద్దరామయ్య పేరిట పూజలు చేస్తున్నారంటూ లేఖ రాశారన్నారు. శక్తి పథకానికి ఏడాదికి నాలుగువేల కోట్లు అవసరం కానుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.2800 కోట్లు అవసరం కాగా బడ్జెట్‌లో కేటాయించామన్నారు. గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్‌ అందించడానికి ప్రయత్నిస్తుంటే విమర్శలు చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది సరాసరిపై పది శాతం పెంచుతూ వర్తింప చేశామన్నారు. భాగ్యజ్యోతి, కుటీరజ్యోతి, అమృతజ్యోతి పథకాల లబ్ధిదారులకు గృహజ్యోతి వర్తింపచేస్తామన్నారు.

గృహలక్ష్మి ద్వారా ఏడాదికి రూ.30 వేల కోట్లు

ప్రతి గృహిణికి నెలకు రూ.2వేలు అందించే గృహలక్ష్మి గ్యారెంటీ పథకానికి బడ్జెట్‌లో ఎక్కువగా నిధులు కేటాయించామని సీఎం పేర్కొన్నారు. ఏడాదికి కనీసంగా రూ.30వేల కోట్లు కానుందని, ఈ ఏడాది రూ.17-18వేల కోట్లు అవసరంగా గుర్తించామన్నారు. త్వరలోనే యాప్‌ద్వారా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఆగస్టు 16న లాంఛనంగా ప్రారంభిస్తామన్నారు. కాంగ్రెస్‌ పథకాల ద్వారా ప్రతి ఇంటికీ కనీసంగా రూ. 4-5వేల దాకా సంక్షేమాలు వర్తింపచేస్తామని, తద్వారా పెరిగిన నిత్యావసరాలు, వంటగ్యాస్‏తో పాటు అన్నింటికీ చేదోడు కానుందన్నారు. అన్నభాగ్యకు అవసరమైనంత బియ్యం నిల్వలు ఉన్నా కేంద్రప్రభుత్వం రాజకీయం చేసిందని మండిపడ్డారు. బియ్యం ఇవ్వనందుకే నగదు బదిలీ చేశామన్నారు. యువనిధితో పాటు వ్యవసాయం, విద్య, వైద్యం ద్వారా రాష్ట్ర ప్రజలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.

Updated Date - 2023-07-15T10:57:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising