CM's warning: ఆ పథకానికి లంచం అడిగితే క్రిమినల్ కేసు
ABN, First Publish Date - 2023-07-26T11:35:40+05:30
గృహలక్ష్మి పథకం కోసం ఎవరైనా లంచం అడిగినట్లు రుజువైతే క్రిమినల్ కేసులు దాఖలు చేస్తామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister
- ముఖ్యమంత్రి సిద్దరామయ్య హెచ్చరిక
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): గృహలక్ష్మి పథకం కోసం ఎవరైనా లంచం అడిగినట్లు రుజువైతే క్రిమినల్ కేసులు దాఖలు చేస్తామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) హెచ్చరించారు. హావేరిలో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించేందుకు మంగళవారం వచ్చిన సీఎం అనంతరం మీడియాతో మాట్లాడారు. గృహలక్ష్మి పథకం కోసం పేర్ల రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితమని పేర్కొన్నారు. ఇందుకు ఎవరికీ లంచం ఇవ్వవద్దని మహిళలను ఆయన కోరారు. జూన్‌లో ప్రకృతి వైపరీత్యాల కారణంగానే రాష్ట్రంలో వర్షపాతం బాగా తక్కువగా నమోదైందని, ప్రస్తుతం రాష్ట్రమంతటా భారీ వర్షాలు(Heavy rains) పడుతూ సర్వత్రా జలకళ కనిపిస్తోందన్నారు. అతివృష్టి సంభవించిన పలు జిల్లాల్లో మంత్రులు, ఉన్నతాధికారుల బృందాలు పర్యటిస్తున్నాయన్నారు. తాను ఉడిపి, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ జిల్లాల్లో పర్యటించి పరిస్థితిని స్వయంగా బేరీజు వేస్తానని చెప్పారు. కాగా రెవెన్యూ శాఖ మంత్రి కృష్ణబైరెగౌడ కొడగు జిల్లాలో పర్యటిస్తున్నారన్నారు.
Updated Date - 2023-07-26T11:35:40+05:30 IST