Commissioner of Police: వరద బాధితులకు ఆహారం అందించిన పోలీస్ కమిషనర్
ABN, First Publish Date - 2023-12-07T07:51:18+05:30
స్థానిక వేళచ్చేరి టాన్సీ నగర్‌లోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన నగర పోలీస్ కమిషనర్ సందీప్రాయ్ రాథోర్(Sandeep Roy Rathore), ఆయా ప్రాంతాల ప్రజలకు
- ఫిర్యాదులకు ప్రత్యేక నెంబర్ల విడుదల
పెరంబూర్(చెన్నై): స్థానిక వేళచ్చేరి టాన్సీ నగర్‌లోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన నగర పోలీస్ కమిషనర్ సందీప్రాయ్ రాథోర్(Sandeep Roy Rathore), ఆయా ప్రాంతాల ప్రజలకు ఆహారం, వాటర్ బాటిళ్లు అందజేశారు. వరద నివారణ చర్యల్లో పోలీసు శాఖలోని డీడీఆర్‌టీ (డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్) సహా అధికారులు, పోలీసులు అని మొత్తం 18,400 మంది పాల్గొని, బాధిత ప్రాంతాల ప్రజలను పడవల ద్వారా రక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో, నగర పోలీస్ కమిషనర్ సందీప్ రాయ్ రాథోడ్ టాన్సీ నగర్‌లో బోటులో ప్రయాణించి, బాధితులకు ఆహారం, వాటర్ బాటిల్స్ అందజేశారు. ఆయన వెంట అడిషినల్ కమిషనర్ (దక్షిణం) ప్రేమ్ ఆనంద్ సిన్హా, జాయింట్ కమిషనర్ (దక్షిణం) శిబిచక్రవర్తి, డిప్యూటీ కమిషనర్ (అడయార్) ఆర్.పొన్‌కార్తీక్‌కుమార్ తదితరులున్నారు.
ఫిర్యాదులకు ప్రత్యేక నెంబర్లు... : వరద పరిస్థితులపై ప్రజలు ఫిర్యాదు చేయాలని నగర పోలీస్ కమిషనర్ సూచించారు. ఆ మేరకు నగర పోలీసు శాఖ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో, ప్రజలు 044-23452359, 23452360, 23452361, 23452377 నెంబర్లు, 044-23452437 (వరద సహాయక కంట్రోల్ రూమ్) సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ కోరారు.
Updated Date - 2023-12-07T07:51:19+05:30 IST