ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Haryana : హర్యానాలో మత ఘర్షణలు.. దుండగుల స్వైర విహారం.. దేవాలయంలో బిక్కుబిక్కుమంటూ 2,500 మంది..

ABN, First Publish Date - 2023-08-01T15:41:20+05:30

హర్యానాలోని నుహ్‌లో సోమవారం జరిగిన మత ఘర్షణల్లో వందలాది మంది మూడు గంటలపాటు ఓ దేవాలయంలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈ దేవాలయం సమీపంలో ఉన్న ఎత్తయిన గుట్టలపై నుంచి దుండగులు కాల్పులు జరుపుతూ, రాళ్లు విసురుతూ స్వైరవిహారం చేస్తుంటే, దాదాపు 2,500 మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు.

న్యూఢిల్లీ : హర్యానాలోని నుహ్‌లో సోమవారం జరిగిన మత ఘర్షణల్లో వందలాది మంది మూడు గంటలపాటు ఓ దేవాలయంలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈ దేవాలయం సమీపంలో ఉన్న ఎత్తయిన గుట్టలపై నుంచి దుండగులు కాల్పులు జరుపుతూ, రాళ్లు విసురుతూ స్వైరవిహారం చేస్తుంటే, దాదాపు 2,500 మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. తమను కాపాడాలని భగవంతుడిని ప్రార్థించారు.

గురుగ్రామ్‌లోని సివిల్ లైన్స్ నుంచి బ్రిజ్ మండల్ జలాభిషేక్ యాత్ర సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఈ జిల్లాలోని అన్ని దేవాలయాలను సందర్శించి, సాయంత్రానికి యాత్ర పూర్తి కావలసి ఉంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో నుహ్ జంక్షన్ వద్ద కొందరు దుండగులు ఈ యాత్రలో పాల్గొన్న భక్తులపైకి రాళ్లు రువ్వడంతో నుహ్‌లోని ఖేడ్లా మోడ్‌లో ఘర్షణలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 4 గంటలకు ఘర్షణలు నుహ్ పరిసర ప్రాంతాలకు వ్యాపించాయి. పోలీస్ స్టేషన్లు, దుకాణాలు, పెట్రోలు బంకులకు నిప్పు పెట్టారు. దాదాపు 80 వాహనాలను తగులబెట్టారు. కొందరు దుండగులు గాలిలోకి కాల్పులు జరిపారు. సాయంత్రం ఐదున్నర గంటలకు ఇంటర్నెట్ సేవలను హర్యానా ప్రభుత్వం నిలిపేసింది. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఈ ఘర్షణలు గురుగ్రామ్‌లోని సోహ్నా, పల్వాల్‌లోని హోడల్, ఫరీదాబాద్‌లోని బల్లబ్‌గఢ్‌లకు వ్యాపించాయి. ఎన్‌హెచ్-8ను దిగ్బంధనం చేయడానికి కొందరు దుండగులు ప్రయత్నించారు, అయితే పోలీసులు దుండగులను చెదరగొట్టారు. సోహ్నాలో అల్లరి మూకలు పోలీసు వలయాన్ని ఛేదించుకుని, ఓ ఇంట్లోకి గ్యాస్ సిలిండర్‌ను విసిరారు. ఇక్కడ ఓ గంటపాటు హింసాత్మక సంఘటనలు జరిగాయి.


నల్హర్‌లోని ఎత్తయిన గుట్టలపైకి ముందుగానే చేరుకున్న దుండగులు ఈ యాత్ర శివాలయం వద్దకు చేరుకుంటున్న సమయంలో కాల్పులు జరిపారు, రాళ్లు, పెట్రోలు బాంబులు విసిరారు. కొందరిని కర్రలతో కొట్టారు. దీంతో దాదాపు 2,500 మంది భక్తులు దేవాలయంలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. గాయపడినవారు రక్తం కారుతుండగా భయకంపితులయ్యారు. వీరంతా మూడు గంటలపాటు ప్రాణ భయంతో గడిపారు.

ఈ ఘర్షణల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, వీరిలో ఇద్దరు పోలీసు సిబ్బంది. నుహ్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఓ దేవాలయంపై కూడా దుండగులు దాడి చేశారు. స్థానిక పోలీసులు పారామిలిటరీ దళాలను రప్పించి, దేవాలయంలో చిక్కుకున్నవారిని కాపాడారు. ఈ హింసాకాండకు బాధ్యులుగా అనుమానిస్తూ 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

భివానీలో కొద్ది నెలల క్రితం ఇద్దరు ముస్లిం వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించగా, ఈ కేసులో బజరంగ్ దళ్ నేత మోను మానేసర్ పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. మోను ఈ యాత్రకు హాజరవుతున్నట్లు వదంతులు ప్రబలడంతో కొందరు దుండగులు రెచ్చిపోయి, ఘర్షణలకు పాల్పడ్డారని ఓ దేవాలయం పూజారి తెలిపారు.


ఇవి కూడా చదవండి :

Nuh violence : హర్యానాలో మత ఘర్షణలు.. ఇద్దరు హోం గార్డులు సహా ముగ్గురి మృతి..

Karnataka : టీటీడీకి కర్ణాటక డెయిరీ ‘నందిని’ షాక్

Updated Date - 2023-08-01T15:41:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising