ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Himachal Pradesh: అసెంబ్లీ ఎన్నికల్లో గెలవగానే షాకిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం

ABN, First Publish Date - 2023-01-08T19:56:19+05:30

హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు (Sukhvinder Singh Sukhu) తీసుకున్న ఈ నిర్ణయంపై బీజేపీ మండిపడింది

Himachal pradesh Congress govt hikes VAT on diesel
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ డీజిల్‌పై వ్యాట్ పెంచింది. దీంతో రాష్ట్రంలో డీజిల్ ధరలు పెరిగాయి. గతంలో డీజిల్‌పై 4 రూపాయల 40 పైసలు వ్యాట్ ఉండగా ప్రస్తుతం మరో 3 రూపాయలు పెంచింది. దీంతో వ్యాట్ 7 రూపాయల 40 పైసలకు చేరింది. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రస్తుతం లీటర్ డీజిల్ ధర 86 రూపాయలకు చేరింది. హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు (Sukhvinder Singh Sukhu) తీసుకున్న ఈ నిర్ణయంపై బీజేపీ మండిపడింది. ఎన్నికల్లో గెలవగానే ప్రజలపై పన్నులు విధించడం ప్రారంభించారని బీజేపీ సీనియర్ నేత, హిమాచల్ ప్రదేశ్ మాజీ మంత్రి సురేశ్ భరద్వాజ్ ఎద్దేవా చేశారు. సామాన్యుల నడ్డి విరిచేలా డీజిల్‌ ధరలు పెంచారని ఆయన విమర్శలు గుప్పించారు. అంతేకాదు ఆరుగురు ఎమ్మెల్యేలను చీఫ్ పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించడాన్ని కూడా భరద్వాజ్ తప్పుబట్టారు. మరోవైపు ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. మరో ఏడుగురిని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో హిమాచల్ కేబినెట్ సభ్యుల సంఖ్య తొమ్మిదికి చేరింది. కొత్తగా క్యాబినెట్‌లోకి తీసుకున్న మంత్రులతో గవర్నర్ రాజేంద్ర విశ్వానాథ్ ఆర్లేకర్ సిమ్లాలోని రాజ్‌భవన్‌లో ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ప్రమాణస్వీకారం చేయించారు. డిసెంబర్ 11న సుఖ్వీందర్ సింగ్, ఆయన డిప్యూటీగా ముఖేష్ అగ్నిహోత్రి మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో సహా హిమాచల్ ప్రదేశ్ క్యాబినెట్‌ సభ్యుల సంఖ్య 12కు మించరాదు.

కొత్తగా మంత్రులుగా ప్రమాణం చేసిన ఏడుగురిలో సోలాన్ నియోజకవర్గం ఎమ్మెల్యే ధని రామ్ శాండిల్, కాంగ్రా జిల్లా జవాలి నియోజకవర్గం ఎమ్మెల్యే చందర్ కుమార్, సిర్‌మౌర్ జిల్లా షిల్లాయ్ నియోజకవర్గం ఎమ్మెల్యే హర్షవర్దన్ చౌహాన్, గిరిజన కన్నూరు జిల్లాకు చెందిన జగత్ సింగ్, జుబ్బల్-కొట్కాయ్ జిల్లా ఎమ్మెల్యే రోహిత్ ఠాకూర్, కసుంప్టి నియోజకవర్గం ఎమ్మెల్యే అనిరుధ్ సింగ్, సిమ్లా రూరల్ ఎమ్మెల్యేల విక్రమాదిత్య సింగ్ ఉన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చేతిలో ఆర్థిక, జనరల్ అడ్మినిస్ట్రేషన్, హోం, ప్లానింగ్, పర్సనల్, ఇతర శాఖలు ఉండగా, ఉప ముఖ్యమంత్రి అగ్నిహోత్రి చేతిలో జల్ శక్తి విభాగ్, రవాణా, భాష, కళలు, సాంస్కృతిక శాఖలు ఉన్నాయి. ఇటీవల జరిగిన హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 68 స్థానాలకు గాను 40 నియోజకవర్గాల్లో గెలిచి విజయఢంకా మోగించింది. పాత పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామన్న ఎన్నికల హామీ కాంగ్రెస్‌పై ఓట్ల వర్షం కురిపించింది. పాత పెన్షన్ స్కీమ్ అమలు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వంపై అదనపు భారం కానుంది.

Updated Date - 2023-01-08T20:16:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising