ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్కార్ విజేతలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

ABN, First Publish Date - 2023-03-14T04:15:51+05:30

‘నాటు నాటు’ పాట ప్రపంచ ఖ్యాతి సొంతం చేసుకుంది. ఈ పాటలో చరణ్‌ భాగమవడం ఆనందంగా ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

‘నాటు నాటు’ పాట ప్రపంచ ఖ్యాతి సొంతం చేసుకుంది. ఈ పాటలో చరణ్‌ భాగమవడం ఆనందంగా ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కు నా హృదయపూర్వక అభినందనలు. భారతీయుల హృదయాలు సంతోషంతో ఉప్పొంగే క్షణాలు ఇవి.

- చిరంజీవి

ఒక దేశంగా, భారతీయ సినిమాగా మనం గెలిచాం. ఆస్కార్‌ అవార్డు ఇంటికి వస్తోంది. భారతీయ సినిమా చరిత్రలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రికార్డులు సృష్టించడానికి తారక్‌తో కలసి మరోసారి డాన్స్‌ చేయాలనుంది.

- రామ్‌చరణ్‌

ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ పురస్కారం గెలుచుకోవడం తెలుగువారికి గర్వకారణం. ‘నాటు నాటు’ పాటలోని సాహిత్యం తెలంగాణ సంస్కృతికి, తెలుగువారి జీవనవిధానానికి అద్దం పడుతుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రపంచ సినీ యవనికపై తెలుగు సినిమా సత్తా చాటింది.

- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌

భారతీయ జెండా రెపరెపలాడుతోంది. తెలుగుపాట అకాడమీ అవార్డు దక్కించుకున్నందుకు గర్విస్తున్నా. అంతర్జాతీయ వేదికపై మన జానపదం ఇంతటి గుర్తింపు సొంతం చేసుకున్నందుకు ఆనందంగా ఉంది.

- ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి

వందకోట్ల బారతీయులం ‘నాటు నాటు’కు దక్కిన గౌరవాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటున్నాం. చరిత్ర సృష్టించిన చంద్రబోస్‌, కీరవాణికి, దేశం గర్వించేలా చేసిన రాజమౌళికి, డాన్స్‌తో ఆకట్టుకున్న చరణ్‌, ఎన్టీఆర్‌కు నా అభినందనలు.

- తెలంగాణ ఐటీశాఖ కేటీఆర్‌

బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో అకాడమీ అవార్డు గెలుచుకోవడం ద్వారా ‘నాటు నాటు’ పాట చరిత్రలో ప్రత్యేక పుటను లిఖించింది. చిత్రబృందానికి అభినందనలు. భారతీయ సినిమాకు ఇవి గర్వించే క్షణాలు.

- నారా చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌ దక్కించుకోవడం అభినందనీయం. చిత్రబృందానికి హృదయ పూర్వక అభినందనలు.

- మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు

తెలుగు సినిమా గర్వించేలా చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందానికి అభినందనలు.

- తెలంగాణ గవర్నర్‌ తమిళిసై

Updated Date - 2023-03-14T04:15:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising