ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka Elections: మల్లికార్జున్ ఖర్గే హత్యకు కుట్ర.. బీజేపీపై కాంగ్రెస్ సంచలన ఆరోపణ

ABN, First Publish Date - 2023-05-06T14:27:01+05:30

కర్ణాటక ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకోవడంతో ప్రధాన పార్టీల నేతలు తీవ్రస్థాయి ఆరోపణలకు దిగుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటక ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకోవడంతో ప్రధాన పార్టీల నేతలు తీవ్రస్థాయి ఆరోపణలకు దిగుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా (Randeep Singh Surjewala) సంచలన ఆరోపణ చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge), ఆయన భార్య సహా మొత్తం కుటుంబాన్ని హత్య చేయడానికి బీజేపీ (BJP) కుట్ర పన్నిందంటూ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు.

సూర్జేవాలా బుధవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ, కలబురగి జిల్లాలోని చిత్తాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ నేత మణికంఠ రాథోడ్ ఆ పార్టీ నాయకులతో సాగించిన సంభాషణలు దీనికి నిదర్శనమని అన్నారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి రాథోడ్ ఆప్తుడని సుర్జేవాలా చెప్పారు. ఖర్గే, ఆయన కుటుంబాన్ని ఫినిష్ చేయాలంటూ ఆడియా క్లిప్‌లో స్పష్టంగా రికార్డయిందని సూర్జవాలా తెలిపారు. రాథోడ్‌కు నేర చరిత్ర ఉందని, 40కి పైగా కేసులు కూడా ఆయన నమోదయ్యాయని చెప్పారు.

సీఎం వివరణ

కాగా, కాంగ్రెస్ అధ్యక్షుడిని, ఆయన కుటుంబాన్ని హత మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై మఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. ఈ అంశాన్ని తాము సీరియస్‌గా తీసుకుంటామని, మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరుపుతామని, చట్టం తన పని తాను చేస్తుందని చెప్పారు.

అది నకిలీ ఆడియో: రాథోడ్

కాగా, తనపై వచ్చిన ఆరోపణలపై రాథోడ్ ఖండించారు. అది నకిలీ ఆడియో అని, ఓటమి భయంతోనే నకిలీ ఆడియోతో కాంగ్రెస్ తనపై దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. ఖర్గేకు కానీ, ఆయన కుటుంబానికి కానీ హాని చేసే ఉద్దేశం తనకు లేదన్నారు. ఈ ఎన్నికల్లో తాను గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2023-05-06T15:05:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising