ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Manipur Violence: మణిపూర్ హింసపై కాంగ్రెస్ నిజనిర్ధారణ బృందం

ABN, First Publish Date - 2023-05-17T15:04:27+05:30

న్యూఢిల్లీ: మణిపూర్‌ లో ఇటీవల పెద్దఎత్తున చెలరేగిన హింసాకాండకు కారణాలు, ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ముగ్గురు సభ్యుల నిజనిర్ధారణ బృందాన్ని బుధవారంనాడు ఏర్పాటు చేశారు. ఈ బృందంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎంపీ ముకుల్ వాస్నిక్, మాజీ ఎంపీ అజాయ్ కుమార్, పార్టీ ఎమ్మెల్యే సుదీప్ రాయ్ బర్మన్ సభ్యులుగా ఉన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మణిపూర్‌ (Manipur)లో ఇటీవల పెద్దఎత్తున చెలరేగిన హింసాకాండకు కారణాలు, ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ముగ్గురు సభ్యుల నిజనిర్ధారణ బృందాన్ని (Fact-Finding team) బుధవారంనాడు ఏర్పాటు చేశారు. హింసకు కారణాలు, అక్కడి పరిస్థితులపై ఈ బృందం అంచనావేసి నివేదికను పార్టీ అధిష్ఠానానికి అందజేస్తుంది. ఈ బృందంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎంపీ ముకుల్ వాస్నిక్, మాజీ ఎంపీ అజాయ్ కుమార్, పార్టీ ఎమ్మెల్యే సుదీప్ రాయ్ బర్మన్ సభ్యులుగా ఉన్నారు. వీరికి సమన్వయకర్తలుగా మణిపూర్ ఏసీసీసీ ఇన్‌చార్జి, పీసీసీ అధ్యక్షుడు, సీపీఎల్ నేత వ్యవహరిస్తారు.

మణిపూర్‌ కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒక్రమ్ ఇబోబి సింగ్, ఆ పార్టీ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గేను ఢిల్లీలో కలుసుకుని రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని ఆయనకు నివేదించారు. దీనిపై ఖర్గే ఓ ట్వీట్‌ చేస్తూ, ఇటీవల మణిపూర్‌లో చెలరేగిన హింసతో ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్న విషయాన్ని మణిపూర్ కాంగ్రెస్ నేతలు తనకు తెలియజేశారని, వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు పరిశీలకుల బృందాన్ని మణిపూర్‌కు త్వరలోనే పంపుతున్నామని చెప్పారు. మణిపూర్‌లో పరిస్థితులు ఇప్పటికీ ఉద్రిక్తంగానే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితి నెలకొనేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరారు.

సుప్రీంకోర్టుకు కేంద్రం స్థాయీ నివేదిక

కాగా, మణిపూర్‌లో పరిస్థితి మెరుగైనట్టు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం బుధవారంనాడు సుప్రీంకోర్టుకు స్థాయీ నివేదికను అందజేశాయి. రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు విన్నవించారు. 315 రిలిఫ్ క్యాంపులను జిల్లా పోలీసులు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సహాయక చర్యల కోసం రూ.3 కోట్ల కంటిన్జెన్సీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ఇంతవరకూ 46,000 మంది ప్రజలకు సాయం అందించినట్టు మెహతా తెలిపారు.

Updated Date - 2023-05-17T15:04:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising