ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka Assembly Elections: మాజీ ఉప ముఖ్యమంత్రి తలకు గాయం.. ఆసుపత్రికి తరలింపు

ABN, First Publish Date - 2023-04-28T20:05:46+05:30

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి పరమేశ్వరపై (Congress leader G Parameshwara) గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు.

G Parameshwara suffered an injury
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) ప్రచారంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి పరమేశ్వరపై (Congress leader G Parameshwara) గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు. కొరాటగిరి నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటనలో ఆయన తలకు గాయమైంది. రక్తస్రావమైన ఆయన్ను అక్కిరాంపురాలోని స్థానిక ప్రాథమిక వైద్య కేంద్రంలో చికిత్స అందించారు. ఆ తర్వాత తుమకూరులోని శ్రీ సిద్ధార్థ మెడికల్ కాలేజ్‌కు తరలించారు. ఆందోళనపడాల్సిన పడొద్దని ఆయన ఆరోగ్యపరిస్థితి సాధారణంగానే ఉందని వైద్యులు తెలిపారు.

మరోవైపు కర్ణాటకలో అన్ని పార్టీల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. రాహుల్ గాంధీ బళ్లారిలో రోడ్ షో నిర్వహించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దావణగెరెలో పర్యటిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 29న కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 6 రోజుల్లో 22 ర్యాలీల్లో ఆయన పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి.

కర్ణాటకలో మే 8తో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. మే పదిన ఎన్నికలు జరుగుతాయి. మే 13న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2023-04-28T20:10:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising