ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mallikarjun Kharge: 100 మంది మోదీలు, షాలు వచ్చినా 2024లో వచ్చేది కాంగ్రెస్ సర్కారే..

ABN, First Publish Date - 2023-02-22T14:14:51+05:30

రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపుతామని, ప్రతిపక్ష కూటమికి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోహిమా: రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపుతామని, ప్రతిపక్ష కూటమికి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. ఇందుకోసం భావసారూప్యత కలిగిన అన్ని పార్టీలతోనూ 137 ఏళ్ల కాంగ్రెస్ చర్చిస్తుందని ప్రకటించారు.

''ప్రధానమంత్రి మోదీ పదేపదే ఓమాట చెబుతున్నారు. దేశాన్ని ఎదుర్కొనే ఏకైక వ్యక్తిని నేను, ఇతర వ్యక్తులు నన్ను తాకలేరని అంటున్నారు. ప్రజాస్వామ్యవాది ఎవరూ అలా చెప్పుకోరు. మీరేమీ నియంత కాదని గుర్తుంచుకోండి. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఆ ప్రజలే మీకు గుణపాఠం చెబుతారు'' అని నాగాలాండ్‌లో జరిగిన ఎన్నికల సభలో ఖర్గే అన్నారు. 2024లో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ సారథ్యం వహిస్తుందని చెప్పారు. ఇతర పార్టీలతో కూడా ఈ దిశగా చర్చలు సాగిస్తున్నామని, కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అనేవి ఉండవని అన్నారు. ప్రతి పార్టీతో తమ అభిప్రాయాలను పంచుకుంటామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ రాదని జోస్యం చెప్పారు. అన్ని పార్టీలను కలుపుకొని తాము మెజారిటీ సాధిస్తామని, 100 మంది మోదీలు, షాలు (అమిత్‌షా) వచ్చినా గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు.

''ఫ్రీడం కోసం దేశ ప్రజలు ప్రాణాలు అర్పించారు. కాంగ్రెస్ వాళ్లు త్యాగాలు చేశారు. బీజేపీ వాళ్లు కాదు. స్వాతంత్ర్యం కోసం బీజేపీ నేత ఒక్కరైనా ఉరికంబానికి ఎక్కారా? కనీసం స్వాతంత్ర్యం కోసం పారాడారా? జైళ్లకు వెళ్లారా? దీనికి బదులు ఒక వ్యక్తి స్వాతంత్ర్యం తెచ్చే, అలాంటి మహాత్మాగాంధీని వాళ్లు పొట్టనపెట్టుకున్నారు. వీళ్లా దేశభక్తి గురించి చెప్పేది?" అని ఖర్గే ఘాటుగా విమర్శించారు. దేశ ఐక్యత కోసం ఇందిరాగాంధీ ప్రాణాలు కోల్పోయారని, రాజీవ్ గాంధీ ప్రాణాలర్పించారని, కానీ వాళ్లు (బీజేపీ) మాత్రం దేశానికి 2014లో స్వాతంత్ర్య వచ్చిందని చెబుతున్నారని, 1947 వాళ్లకు గుర్తులేదని ఎద్దేవా చేశారు. కాగా, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సోమవారంనాడు జరుగనుంది. త్రిపుర ఎన్నికల ఓటింగ్ గత వారం జరిగింది.

Updated Date - 2023-02-22T14:14:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising