ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Congress MP Dhiraj Prasad Sahu: ఐటీ దాడుల్లో రూ.350 కోట్ల నగదు పట్టుబడడంపై తొలిసారి స్పందించిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్

ABN, Publish Date - Dec 15 , 2023 | 09:55 PM

తనకు సంబంధించిన ఇళ్లల్లో ఐడీ దాడులు, వందలాది కోట్ల రూపాయల నగదు రికవరీపై కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహు తొలిసారి స్పందించారు. చోటుచేసుకుంటున్న పరిణామాలు బాధకు గురిచేస్తున్నాయని అన్నారు.

న్యూఢిల్లీ: తనకు సంబంధించిన ఇళ్లల్లో ఐడీ దాడులు, వందలాది కోట్ల రూపాయల నగదు రికవరీపై కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహు తొలిసారి స్పందించారు. చోటుచేసుకుంటున్న పరిణామాలు బాధకు గురిచేస్తున్నాయని అన్నారు. రికవరీ చేసిన డబ్బు తన కంపెనీకి చెందినదని తాను ఒప్పుకుంటున్నానని, ఈ డబ్బంతా తన లిక్కర్ కంపెనీకి చెందినదని అన్నారు. ఈ డబ్బుతో కాంగ్రెస్‌ పార్టీకి గానీ, మరే ఇతర రాజకీయ పార్టీలతో సంబంధం లేదని ఖండించారు. ఆ డబ్బు అంతా తనది కాదన్నారు. తన కుటుంబానికి, ఇతర సంబంధిత సంస్థలకు చెందినదని వివరించారు. ఐటీ దాడులకు సంబంధించి ప్రతి దానికి సమాధానం చెప్పగలనని తెలిపారు.


కాగా కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహు‌కు చెందిన ఒడిశా, ఝార్ఖండ్‌లోని ఆయనకు చెందిన ప్రాంగణాలపై ఆదాయపు పన్నుశాఖ నిర్వహించిన దాడుల్లో పెద్ద మొత్తంలో లెక్క చూపని రూ.351 కోట్ల నగదును అధికారులు గుర్తించారు. ఒకే విడతలో ఇంత పెద్దమొత్తంలో పట్టుబడడం ఐటీ చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం గమనార్హం. మొత్తం 176 డబ్బు సంచులను గుర్తించారు. ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న నగదులో ఎక్కువ మొత్తం ఒడిశాలోని బౌధ్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్‌ ప్రాంగణంలోనే పట్టుబడింది. కాగా ధీరజ్ సాహు కుటుంబం లిక్కర్ వ్యాపారం చేస్తోంది. ఒడిశాలో అనేక ఫ్యాక్టరీలు ఉన్నాయి.

Updated Date - Dec 15 , 2023 | 10:02 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising