ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Himanta Biswa Sarma: మణిపూర్ సంక్షోభానికి కాంగ్రెస్ విధానాలే కారణమన్న అస్సాం సీఎం.. ప్లేటు భలే తిప్పేశాడుగా!

ABN, First Publish Date - 2023-09-20T21:57:56+05:30

బీజేపీకి అత్యంత విధేయుడిగా పని చేస్తున్న అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ.. కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాల్సిన పనులను పక్కన పెట్టేసి..

బీజేపీకి అత్యంత విధేయుడిగా పని చేస్తున్న అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ.. కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాల్సిన పనులను పక్కన పెట్టేసి.. ఫక్తు బీజేపీ భక్తుడిగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన మరోసారి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. ప్రస్తుతం మణిపూర్‌లో నెలకొన్న సంక్షోభానికి కాంగ్రెస్ పార్టీనే కారణమంటూ ఆరోపణలు చేశారు. నిజానికి.. మణిపూర్‌లో బీజేపీ అధికారంలో ఉంది. వారి హయాంలోనే అక్కడ అల్లర్లు జరుగుతున్నాయి. కానీ.. తెలివిగా ఈ నేరాన్ని కాంగ్రెస్‌పై నెట్టేందుకు ఆయన ప్రయత్నించారు.


బీజేపీ చేపట్టిన పరివర్తన్ సంకల్ప్ యాత్రలో బుధవారం పాల్గొన్న హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఈశాన్య రాష్ట్రాల్లోని ఎనిమిది రాష్ట్రాలు అశాంతికి గురయ్యాయని అన్నారు. ఇప్పుడు ఏడు రాష్ట్రాల్లో శాంతి నెలకొని ఉందని చెప్పారు. అయితే.. అప్పట్లో కాంగ్రెస్ చేపట్టిన విధానాల కారణంగానే ఇప్పుడు మణిపూర్‌లో సంక్షోభం నెలకొందని ఆరోపించారు. కాగా.. తమకూ షెడ్యూల్డ్ తెగ హోదా కల్పించాలని మెయిటీ కమ్యూనిటీ డిమాండ్ చేస్తుండగా, నాగా & కుకీ తెగ వారు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశం మీదే మే 3వ తేదీన మణిపూర్‌లో హింస చెలరేగింది. ఇప్పటివరకూ ఈ అల్లర్ల కారణంగా 175 మందికి పైగా చనిపోగా, వందల మంది గాయపడ్డారు. బహుశా.. అధికారంలో ఉన్న బీజేపీ మొదట్లోనే సరైన చర్యలు తీసుకొని ఉంటే, ఇంత ఘోరం జరిగేది కాదేమో!

ఇదే సమయంలో.. ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల అంశాన్ని కూడా హిమంత ప్రస్తావించారు. ఇండియా కూటమికి చెందిన సభ్యులు పదే పదే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినా.. కాంగ్రెస్ మాత్రం మౌనం వహిస్తోందంటూ ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ కూడా ఈ వ్యాఖ్యల్ని ఖండించలేదన్నారు. ఒకవేళ ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడి ఉంటే, కచ్ఛితంగా తల తెగిపోయేదన్నారు. ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడాలని తాను అనడం లేదని.. కానీ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేసినా కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు.

Updated Date - 2023-09-20T21:57:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising