ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rahul Gandhi: మోదీ దగ్గర ఉన్న రిమోట్ నొక్కితే ఏం అవుతుందో తెలుసా?: రాహుల్ గాంధీ

ABN, First Publish Date - 2023-09-25T16:49:15+05:30

ఛత్తీస్ ఘడ్(Chattisgarh) పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) బీజేపీపై మండిపడ్డారు. అక్కడ ముఖ్యమంత్రి గ్రామీణ ఆవాస్ న్యాయ్ యోజనను రిమోట్ కంట్రోల్ ద్వారా ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో రాహుల్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర ఓ రిమోట్ ఉందని దాన్ని సీక్రెట్ రిమోట్ అంటారని తెలిపారు.

రాయ్ పుర్: ఛత్తీస్ ఘడ్(Chattisgarh) పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) బీజేపీపై మండిపడ్డారు. అక్కడ ముఖ్యమంత్రి గ్రామీణ ఆవాస్ న్యాయ్ యోజనను రిమోట్ కంట్రోల్ ద్వారా ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో రాహుల్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర ఓ రిమోట్ ఉందని దాన్ని సీక్రెట్ రిమోట్ అంటారని తెలిపారు. ఆ రిమోట్ నొక్కితే బడా పారిశ్రామికవేత్త అదానీ(Adani) కంపెనీ ముంబయి ఎయిర్ పోర్ట్ ని పొందుతుందని, పబ్లిక్ సెక్టార్ ప్రైవేటుపరం అవుతుందని ఆరోపించారు.


అదానీకి బీజేపీ(BJP) ప్రభుత్వం చేస్తున్న లబ్ధిపై తాను పార్లమెంటులో ప్రశ్నిస్తే ఏకంగా తన సభ్యత్వమే రద్దు చేపిస్తారని అన్నారు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మోదీ చేసిన వ్యాఖ్యలను రాహుల్ ఖండించారు. బీజేపీ కులగణన చేయడానికి వెనకాడుతోందని.. తాము అధికారంలోకి రాగానే కులగణన చేయిస్తామని ఆయన స్పష్టం చేశారు. త్వరలో 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-25T16:52:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising