BBC documentary on Modi: మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ.. కాంగ్రెస్ నుంచి ఊహించని స్పందన
ABN, First Publish Date - 2023-01-24T20:01:38+05:30
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi)పై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ సిరీస్‌పై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. భారత్‌లో అంతర్గతంగా భేదాభిప్రాయాలు ఎన్ని ఉన్నా...
తిరువనంతపురం: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi)పై బీబీసీ (BBC) ప్రసారం చేసిన డాక్యుమెంటరీ సిరీస్‌పై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. భారత్‌లో అంతర్గతంగా భేదాభిప్రాయాలు ఎన్ని ఉన్నా... విదేశీ మీడియా కలుగజేసుకుని విభేదాలు సృష్టించేందుకు అవకాశం కల్పించరాదని కాంగ్రెస్ పార్టీ కేరళ డిజిటల్ కమ్యూనికేషన్స్ విభాగాధిపతి అనిల్ కె ఆంటొనీ అభిప్రాయపడ్డారు. 20 ఏళ్ల క్రితం జరిగినదానిపై ఇప్పుడు రగడ ఎందుకని ఆయన ప్రశ్నించారు. భారత్‌లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఉందని చెప్పారు. అనిల్ కె ఆంటొనీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఏకే ఆంటొనీ కుమారుడు.
బీబీసీ (BBC) మోదీపై రెండు భాగాలుగా ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్ల సమయంలో మోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్తూ, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంపై ఈ డాక్యుమెంటరీలో విమర్శలు గుప్పించింది. దీంతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఇప్పటికే దీనిని తొలగించారు. భారతీయ మూలాలుగల బ్రిటన్ పౌరులు ఈ డాక్యుమెంటరీని తీవ్రంగా ఖండించారు. ప్రముఖ బ్రిటన్ పౌరుడు లార్డ్ రమి రేంజర్ మాట్లాడుతూ, 100 కోట్ల మందికిపైగా గల భారతీయుల మనసును బీబీసీ తీవ్రంగా గాయపరిచిందన్నారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఓ ప్రశ్నకు సమాధానం చెప్తూ, బ్రిటన్ అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీ షో వలసవాద ఆలోచనా ధోరణిని వెల్లడిస్తోందని అన్నారు. విశ్వసనీయత లేని కథనాన్ని అందరి మనసుల్లోకి చొప్పించాలనే లక్ష్యంతో రూపొందించిన, తప్పుదారి పట్టించే, పక్షపాతంతో కూడిన ప్రచారమని ఆరోపించారు. పక్షపాతం ఉండటం, నిష్పాక్షికత లేకపోవడం, వలసవాద ఆలోచనా ధోరణిని యథేచ్ఛగా కొనసాగించడం ఆలస్యంగా స్పష్టమవుతున్నాయన్నారు. ఇటువంటి కథనాన్ని ప్రచారం చేయడంలో బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (BBC) వ్యక్తుల ధోరణి కనిపిస్తోందని తెలిపారు. దీనిని ప్రసారం చేయడంలో ఎజెండా ఏమిటని ప్రశ్నించారు.
అటు కేంద్రం కూడా ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్’ పేరుతో బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని భారత్‌లో బ్లాక్ చేయాలంటూ యూట్యూబ్, ట్విటర్‌లను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వచంద్ర ఆదేశాలు జారీ చేశారు. ఈ డాక్యుమెంటరీ మొదటి భాగాన్ని బీబీసీ ఇటీవల భారత్ మినహా ఇతర దేశాల్లో విడుదల చేసింది. భారత్‌లో బీబీసీ ఈ డాక్యుమెంటరీని ప్రసారం చేయకున్నా.. కొందరు వ్యక్తులు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ట్విటర్‌లోనూ ఈ డాక్యుమెంటరీ లింకులను షేర్ చేశారు. వాటిని తొలగించాలని, భవిష్యత్‌లో ఈ వీడియో అప్‌లోడ్ కాకుండా బ్లాక్ చేయాలని అపూర్వచంద్ర తన ఆదేశాల్లో స్పష్టం చేశారు. సమాచార సాంకేతిక నిబంధనలు-2021లోని ఎమర్జెన్సీ అధికారాలను వినియోగించి, ఈ ఆదేశాలను జారీ చేశారు. కాగా.. ఈ డాక్యుమెంటరీపై 302 మంది మాజీ జడ్జిలు, విశ్రాంత బ్యూరోక్రాట్లు తీవ్రంగా స్పందించారు. ‘‘ఇది భారత్‌లో హిందూ-ముస్లింల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టే చర్య. విభజించు-పాలించు అనేది బ్రిటిష్ నైజం అయితే.. అందరినీ కలుపుకొనిపోవడం భారత్ నీతి. బీబీసీ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి’’ అని వారు వ్యాఖ్యానించారు.
నూతన రాష్ట్ర సచివాలయ ఫిబ్రవరి 17న ఉదయం 11:30 నుంచి 12:30 గంటల మధ్య ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ భవనాన్ని ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి ముందు వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రులు స్టాలిన్, హేమంత్ సోరెన్, బీహార్ డిప్యూటీ ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్, ఇతర రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. కాగా నూతన సచివాలయానికి తుది దశకు చేరుకున్న సచివాలయ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారు. అయన వెంట పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు ఉన్నారు.
Updated Date - 2023-01-24T20:47:12+05:30 IST