ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Haath Se Haath Jodo Abhiyan: ప్రచార లోగో, మోదీ ప్రభుత్వంపై చార్జిషీటు విడుదల చేసిన కాంగ్రెస్

ABN, First Publish Date - 2023-01-21T15:17:02+05:30

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ సారథ్యంలో గత ఏడాది సెప్టెంబర్ 7న మొదలై జనవరి 30వ తేదీతో ముగియనున్న 'భారత్ జోడో యాత్ర' సందేశాన్ని ఇంటింటికి చేరవేసేందుకు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ సారథ్యంలో గత ఏడాది సెప్టెంబర్ 7న మొదలై జనవరి 30వ తేదీతో ముగియనున్న 'భారత్ జోడో యాత్ర' సందేశాన్ని ఇంటింటికి చేరవేసేందుకు కాంగ్రెస్ పార్టీ 'హాథ్ సే హాథ్ జోడో అభియాన్'(Haath Se Haath Jodo Abhiyan) ప్రచారాన్ని చేపట్టనుంది. ఇందుకు సంబంధించిన లోగోతో పాటు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చార్జిషీటు (Chargesheet) ను శనివారంనాడు విడుదల చేసింది. ఈనెల 26వ తేదీ నుంచి రెండు నెలల పాటు 'హాథ్ సే హాథ్ జోడో' ప్రచారం సాగనుందని న్యూఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. రాహుల్ గాంధీ సారథ్యంలోని జోడో యాత్ర సందేశాన్ని సామాన్య ప్రజానీకానికి సైతం చేరవేసేందుకు ఈ ప్రచారం చేపడుతున్నట్టు తెలిపారు.

మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చార్జిషీటును కూడా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు (పీసీసీలు) చార్జిషీట్లు తయారు చేస్తాయని వేణుగోపాల్ తెలిపారు. మోదీ ప్రభుత్వ అవకతవకల పాలన కారణంగా ప్రజలకు ఎదురైన ఇబ్బందులను పరిష్కరించేందుకు తమ పార్టీ కృష్టి చేస్తుందన్నారు. 130 రోజుల చారిత్రక ప్రోగ్రాం (భారత్ జోడో యాత్ర) తర్వాత దేశ ప్రజల నుంచి విస్తృత సమాచారాన్ని కాంగ్రెస్ పార్టీ సేకరించిందని, లక్షలాది మంది రాహుల్ గాంధీ అడుగులో అడుగులు వేసి ఆయనతో సంభాషించారని చెప్పారు. మోదీ ప్రభుత్వ తప్పిదాల పాలన కారణంలో ప్రజలు ఎదుర్కొన్న ఈతిబాధలను తాము అవగతం చేసుకున్నామని అన్నారు.

కాగా, దీనికి ముందు జమ్మూకశ్మీర్‌లోని కతువాలో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరామ్ రమేష్ మాట్లాడుతూ, తమ పార్టీ చేపట్టనున్న ఇంటింటి ప్రచారం 6 లక్షల గ్రామాలు, 2.5 లక్షల గ్రామ పంచాయతీల్లోని 10 లక్షల పోలింగ్ బూత్‌లకు తీసుకువెళ్తామని చెప్పారు. 'హాథ్ సే హాథ్ జోడో' ప్రచారం జనవరి 26 నుంచి మార్చి 26 వరకూ జరుపుతామన్నారు. పార్టీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి రాహుల్ గాంధీ లేఖను ప్రజలకు అందజేస్తారని చెప్పారు.

Updated Date - 2023-01-21T15:59:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising