Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు క్రెడిట్ పూర్తిగా మోదీదే: అమిత్‌షా
ABN, First Publish Date - 2023-09-19T19:25:25+05:30
మహిళా రిజర్వేషన్ బిల్లు క్రెడిట్ పూర్తిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీదేనని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆలోచన తమదేనని కాంగ్రెస్ చెప్పుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదన్నారు.
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లు (Women's Reservation Bill) క్రెడిట్ పూర్తిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీదేనని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా (Amit shah) అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆలోచన తమదేనని కాంగ్రెస్ చెప్పుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదని, మోదీ ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయం క్రెడిట్ కోసం కాంగ్రెస్ జిమ్మిక్కులు చేస్తోందని ఓ ట్వీట్‌లో ఆయన అన్నారు.
'నారీ శక్తి వందన్ అధినియం' బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడంతో దేశ ప్రజలంతా ఎంతో ఉల్లాసంగా ఉన్నారనీ, మహిళా సాధికరతకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఈ విషయాన్ని ఈ బిల్లు చాటుతోందని అమిత్‌షా అన్నారు. ''ఈ విషయాన్ని విపక్షాలు జీర్ణించుకోలేకపోవడం బాధాకరం. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. చట్టం గడువు తీరిపోయేలా చేయడమో, బిల్లు సభలోకి రాకుండా యూపీఏ మిత్ర పార్టీలు అడ్డుకోవడమో జరిగేది. మహిళా బిల్లు క్రెడిట్ కోసం ఎంత పాకులాడినా వాళ్ల ద్వంద్వ ప్రమాణాలు దాచుకోవాలన్నా దాగవు'' అని అమిత్‌షా అన్నారు.
Updated Date - 2023-09-19T19:25:25+05:30 IST