ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka Elections: 140 సీట్లు మావే, సీఎం ఎవరంటే?: డీకే శివకుమార్

ABN, First Publish Date - 2023-05-06T15:42:59+05:30

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 140 సీట్లకు పైగా గెలుచుకుంటుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Elections) కాంగ్రెస్ పార్టీ 140 సీట్లకు పైగా గెలుచుకుంటుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shivakumar) ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని పీటీఐ వార్తాసంస్థకు శనివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్‌సీ)అంశాలను ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ లేవనెత్తడంపై డీకే విమర్శించారు. ఆ పార్టీ ఆలోచనల్లో దివాళాకోరుతనాన్ని, రాష్ట్రంపై ఎలాంటి విజన్‌ లేకపోవడాన్ని ఇవి సూచిస్తున్నాయని అన్నారు. కర్ణాటక కోసం ఎలాంటి విజన్ బీజేపీకి లేదని, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ ఫ్యాక్టర్ ఎంతమాత్రం పనిచేయదని స్పష్టం చేశారు.

పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం..

ముఖ్యమంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గం పోరు ఉందన్న ఊహాగానాలను డీకే కొట్టివేశారు. ఇదంతా మీడియా సృష్టేనని, అందులో ఎంతమాత్రం నిజం లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఐక్యంగా ఉందని, ఈ సందేశాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇటు క్షేత్ర స్థాయిలోనూ, సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి తామంతా సమష్టి కృషి సాగిస్తున్నట్టు తెలిపారు. సీఎం పదవికి గట్టిపోటీదారుగా తాను ఉన్న విషయంపై మాట్లాడుతూ, కర్ణాటకలో మెజారిటీ సీట్లతో విజయం సాధించడానికే తాను మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. సీఎం పదవిపై అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందన్నారు.

ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోలేదు..

గత మూడేళ్లలో కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో గట్టిగా పనిచేస్తూ వచ్చిందని, ఫ్రీడం మార్చ్‌తో 100 పైగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించామని, 78 లక్షల మంది సభ్యులను నమోదు చేసుకున్నామని, కర్ణాటకలో భారత్ జోడో యాత్రను విజయవంతం చేశామని చెప్పారు. మూడేళ్లలో కాంగ్రెస్ నేతలు ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోలేదని తెలిపారు. ఇదే ఇప్పుడు ప్రజల్లో చాలా స్పష్టంగా కనిపిస్తోందని, పార్టీ కఠోర శ్రమకు గెలుపు తథ్యమని అన్నారు.

ఉద్యోగాల్లేవు, ధరలు అందుబాటులో లేవు...

బీజేపీ ప్రభుత్వం ఉద్యోగాల కల్పన చేయలేకపోయిందని, చుక్కలనుంటుతున్న ధరలను అదుపు చేయడంలో విఫలమైందని డీకే విమర్శించారు. ఇప్పుడు ఆ పార్టీ రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా సమాజాన్ని విడగొట్టే ప్రయత్నాలు చేస్తోందని తప్పుపట్టారు. కర్ణాటకలో వారి పాచికలు పారవని, కర్ణాటక ప్రజలు ఆ పార్టీని తుడిచిపెట్టనున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి పెద్దఎత్తున ప్రజామద్దతు లభిస్తోందని, తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు.

పీఎం మాటలపై...

ప్రధానమంత్రి తనను తిట్టిపోస్తున్నారంటూ పదేపదే చెబుతుండటంపై అడిగినప్పుడు, కర్ణాటక ప్రజలు నాగరికత కలిగిన ప్రజలని, ఎదుటి వాళ్ల అలాంటి భాష మాట్లాడినా అదే తరహాలో మాట్లాడేందుకు ఇష్టపడరని చెప్పారు. పరుషపదజాలం వాడటం కాంగ్రెస్ పార్టీకి ఇష్టముండదని, ప్రకటనలను వక్రీకరించిన ప్రజలను తప్పుదారి పట్టించడంలో బీజేపీని మించిన వాళ్లులేరని అన్నారు. మోదీ ఫ్యాక్టర్ ఈ ఎన్నికల్లో పనిచేయదని, కేవలం అభివృద్ధి ఆధారిత ఎజెండాపైనే ఈ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు సాధించి లోక్‌సభ ఎన్నికలకు వెళ్లబోతోందని, కర్ణాటక ప్రజలు తమ తీర్పుతో దేశానికి కీలక సందేశం ఇవ్వనున్నారని అన్నారు. 2023లో కర్ణాటకలోనూ, 2024లో దేశంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 224 మంది సభ్యుల కర్ణాటక అసెంబ్లీకి ఈనెల 10న పోలింగ్ జరుగనుండగా, మే 13న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2023-05-06T16:09:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising