ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Wrestlers: మద్యం తాగిన పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారు...కన్నీటిపర్యంతమైన మహిళా రెజ్లర్లు

ABN, First Publish Date - 2023-05-04T10:01:59+05:30

ఢిల్లీ పోలీసులు పీకలదాకా మద్యం తాగి తమను దుర్భాషలాడుతూ అసభ్యంగా ప్రవర్తించారని మహిళా రెజ్లర్లు ఆవేదన వ్యక్తం చేశారు....

Teary eyed wrestlers
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులు పీకలదాకా మద్యం తాగి తమను దుర్భాషలాడుతూ అసభ్యంగా ప్రవర్తించారని మహిళా రెజ్లర్లు ఆవేదన వ్యక్తం చేశారు.బుధవారం అర్థరాత్రి( late night scuffle) మహిళా రెజ్లర్లపై ఢిల్లీ పోలీసుల అనుచిత ప్రవర్తనపై మహిళా రెజ్లర్లు మండిపడ్డారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ పై నిరసన వ్యక్తం చేస్తున్న తమపై మద్యం తాగిన ఢిల్లీ పోలీసులు(Cop was drunk) అసభ్యంగా ప్రవర్తించారని బజరంగ్ పునియా, సాక్షి మాలిక్‌లతో పాటు భారత అగ్రశ్రేణి రెజ్లర్లలో ఒకరైన వినేష్ ఫోగట్ ఆరోపించారు.న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు, పోలీసుల మధ్య జరిగిన తోపులాట తర్వాత సంగీతా ఫోగట్ మీడియాతో మాట్లాడారు.తమ రాత్రి బస కోసం ఫోల్డబుల్ మంచాలను తీసుకురావాలనుకున్నప్పుడు తోపులాట జరిగిందని సంగీతా ఫోగట్ చెప్పారు.

‘‘వర్షం కారణంగా పరుపులు తడిసిపోయాయి, దీంతో మేం నిద్రించడానికి మడత మంచాలు తీసుకువస్తున్నాం,దీనికి పోలీసులు అనుమతించలేదు. మద్యం మత్తులో ఉన్న పోలీసు ధర్మేంద్ర రెజ్లర్ వినేష్ ఫోగట్‌ను దుర్భాషలాడాడు, మాతో గొడవకు దిగాడు’’ అని మాజీ రెజ్లర్ రాజ్‌వీర్ చెప్పారు.ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతక విజేతలపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించడంపై ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.‘‘మమ్మల్ని చంపాలనుకుంటే చంపేయండి’’ వినేష్ ఫోగట్ కన్నీళ్లు పెట్టుకుంది.(Teary eyed wrestlers) ‘‘ఈ రోజు చూడ్డానికి మనం దేశం కోసం పతకాలు సాధించామా? మేం తిండి కూడా తినలేదు. మహిళలను దుర్భాషలాడే హక్కు ప్రతి పురుషుడికి ఉందా? ఈ పోలీసులు తుపాకులు పట్టుకున్నారు, వారు మమ్మల్ని చంపుతారు’’ అని వినేష్ ఫోగట్ అన్నారు.

ఇది కూడా చదవండి : Encounter: జమ్మూకశ్మీరులో ఎన్‌కౌంటర్...ఇద్దరు ఉగ్రవాదుల హతం

కాగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు సోమనాథ్ భారతి అనుమతి లేకుండా మడత మంచాలతో పాటు సైట్‌కు వచ్చారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రణవ్ తాయల్ చెప్పారు.రెజ్లర్లకు పరుపులు ఇవ్వాలని డిమాండ్ చేసినందుకు తనను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆప్ ఎమ్మెల్యే ఆరోపించారు.

Updated Date - 2023-05-04T10:10:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising