ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Covid: మళ్లీ పెరుగుతున్న ‘కరోనా’: ఒకరు బలి!

ABN, First Publish Date - 2023-04-05T08:39:32+05:30

రాష్ట్రంలో సుమారు నెల రోజుల తరువాత మరో కరోనా మృతి నమోదైనట్టు తెలిసింది. మార్చి 12న తిరుచ్చి జిల్లాలో ఓ యువకుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రంలో సుమారు నెల రోజుల తరువాత మరో కరోనా మృతి నమోదైనట్టు తెలిసింది. మార్చి 12న తిరుచ్చి జిల్లాలో ఓ యువకుడు కరోనా కారణంగా కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తూత్తుకుడిలో కరోనా లక్షణాలతో ఒకరు మృతిచెందినట్టు తెలిసింది. రాష్ట్రంలో చెన్నై, కోవై, సేలం, తిరుచ్చి(Chennai, Kowai, Salem, Trichy) తదితర జిల్లాల్లో కరోనా వ్యాప్తి క్రమక్రమంగా విస్త్రతమవుతోంది. కరోనా వ్యాప్తి నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో, తూత్తుకుడి ప్రభుత్వాసుపత్రిలో కరోనా లక్షణాలతో చికిత్స పొందుతున్న పార్తిబన్‌ (54) చికిత్స ఫలించక మంగళవారం మృతిచెందినట్టు భావిస్తున్నారు. గత నెల 23వ తేదీ నుంచి కరోనా లక్షణాలతో అతను చికిత్స పొందుతున్నాడు. కాగా, మృతుడు పార్తిబన్‌కు కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలున్నట్లు సమాచారం.

భయాందోళనలు వద్దు: ఆరోగ్య మంత్రి సుబ్రమణ్యం

కరోనా వ్యాప్తిపై ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Health Minister M. Subramaniam) తెలిపారు. దిండుగల్‌లో మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని, కేంద్రప్రభుత్వం సూచించిన ముందు జాగ్రత్త చర్యలు ప్రభుత్వం చేపట్టిందన్నారు ప్రస్తుతం వ్యాప్తిస్తున్న వైరస్‌ ప్రాణాంతకమైనది కాదని, ఇతర అనారోగ్య సమస్యలున్న వారు మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

బహిరంగ ప్రాంతాల్లో మాస్కు ధరించండి ఆరోగ్యశాఖ

బహిరంగ ప్రాంతాల్లో ప్రజలు తప్పకుండా మాస్కు(Mask) ధరించాలని ఆరోగ్యశాఖ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా నియంత్రణ చర్యలను వేగవంతం చేయడంతో పాటు బాధితులకు మెరుగైన చికిత్సలందించేలా ప్రభుత్వాసుపత్రులను సిద్ధం చేసినట్టు పేర్కొంది. ఇప్పటికే ప్రభుత్వాసుపత్రులు, థియేటర్లు, ఏసీ వసతితో కూడిన వాణిజ్య సముదాయాల్లో సిబ్బందితో పాటు ప్రజలు మాస్కులు ధరించాలని సూచించామన్నారు. అదే సమయంలో బహిరంగ ప్రాంతాల్లో కూడా ప్రజలు మాస్కు ధరించి, స్వీయరక్షణ పాటించాలని ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది.

ఇదికూడా చదవండి: JDS Alliance MIM : జేడీఎస్‌తో ఎంఐఎం పొత్తు?

Updated Date - 2023-04-05T08:39:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising