Covid: మూతపడుతున్న కరోనా ప్రత్యేక వార్డులు
ABN, First Publish Date - 2023-05-20T08:14:57+05:30
రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వాసుపత్రుల్లో ఏర్పాటు చేసిన కరోనా ప్రత్యేక వార్డులు మూతపడుతున్నాయి. మార్చి వరకు సింగిల్ డిజిట్‌లో
పెరంబూర్(చెన్నై): రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వాసుపత్రుల్లో ఏర్పాటు చేసిన కరోనా ప్రత్యేక వార్డులు మూతపడుతున్నాయి. మార్చి వరకు సింగిల్ డిజిట్‌లో ఉన్న కరోనా బాధితుల సంఖ్యలో ఏప్రిల్ నెల మొదటి వారంలో హఠాత్తుగా మూడంకెలకు చేరింది. చెన్నై, చెంగల్పట్టు తదితర జిల్లాల్లో కరోనా వ్యాప్తి 11.2 శాతం ఉండడం, పలు జిల్లాల్లో కేసుల సంఖ్య పెరగడంతో అప్రమత్తమైన రాష్ట్రప్రభుత్వం, ప్రభుత్వాసుపత్రుల్లో కరోనా ప్రత్యేక వార్డులు(Corona special wards) ఏర్పాటుచేయడంతో పాటు ఆక్సిజన్, మందులు సిద్ధం చేసి, బాధితులకు సత్వరం మెరుగైన చికత్సలందించేలా చర్యలు చేపట్టింది. అలాగే, ప్రభుత్వాసుపత్రులు, బహిరంగ ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు ధరించాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో, గురువారం గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 30 జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి 0.2 శాతానికి తగ్గడంతో ఆరోగ్యశాఖ ఊపిరి పీల్చుకుంది.
Updated Date - 2023-05-20T08:14:57+05:30 IST