ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Covid: రాష్ట్రంలో పెరుగుతున్న ‘కరోనా’ కేసులు.. ఒకేరోజు 20 మందికి నిర్ధారణ

ABN, Publish Date - Dec 20 , 2023 | 07:38 AM

రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సోమవారం నిర్వహించిన పరీక్షల్లో 20 మందికి కరోనా లక్షణాలు నిర్ధారణ అయ్యాయి.

పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సోమవారం నిర్వహించిన పరీక్షల్లో 20 మందికి కరోనా లక్షణాలు నిర్ధారణ అయ్యాయి. కేరళ రాష్ట్రంలో కొద్దిరోజులుగా కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో, రాష్ట్రంలో కూడా కరోనా వ్యాప్తి స్వల్పంగా పెరుగుతోంది. కొద్దిరోజుల వరకు చెన్నై సహా ఇతర జిల్లాల్లో ఒకటి, రెండు కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం చెన్నై, కోయంబత్తూర్‌, తిరుప్పూర్‌ తదితర జిల్లాల్లో కరోనా వ్యాప్తి అధికమవుతోంది. సోమవారం మాత్రమే 20 మందికి కరోనా లక్షణాలు నిర్ధారణ కాగా, వీరితో కలిసి 64 మంది చికిత్సలు పొందుతున్నారు. సింగపూర్‌, కేరళలో కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రంలో కూడా పరీక్షలు పెంచామన్నారు. గత వారం వరకు 250 పరీక్షలు చేపడుతుండగా, ప్రస్తుతం దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలతో వచ్చే వారికీ ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు.

మాస్కు ధరించండి... : అదే సమయంలో కరోనా వ్యాప్తి నియంత్రణలో ఉందని, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఒకటి, రెండు కేసులు నమోదవుతున్నాని ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. ప్రస్తుత కరోణా లక్షణాలకు ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం లేదన్నారు. అదే సమయంలో, ఆసుపత్రులు, రద్దీ స్థలాల్లో మాస్కు ధరించడం మంచిదని అధికారులు సూచించారు.

Updated Date - Dec 20 , 2023 | 07:38 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising