ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Covid: విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లలో మాస్క్‌ తప్పనిసరి

ABN, Publish Date - Dec 20 , 2023 | 11:08 AM

రాష్ట్రంలో కొవిడ్‌(Covid) తాజా వైర్‌సకు ఒక వ్యక్తి బలైన నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ రెడ్‌ అలెర్ట్‌(Red alert) ప్రకటించింది. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లలో

- రాష్ట్రంలో ఆరోగ్యశాఖ రెడ్‌ అలర్ట్‌

- వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్‌ గుండూరావు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌(Covid) తాజా వైర్‌సకు ఒక వ్యక్తి బలైన నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ రెడ్‌ అలెర్ట్‌(Red alert) ప్రకటించింది. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లలో తప్పనిసరిగా మాస్క్‌ను వినియోగించాలని ఆరోగ్యశాఖ మం త్రి దినేశ్‌ గుండూరావు ప్రజలకు సూచించారు. కొవిడ్‌ తాజా వైరస్‌ జేఎన్‌1ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందన్నారు. ఢిల్లీలో కేంద్రప్రభుత్వం బుధవారం ఏర్పాటు చేస్తున్న కీలక సమావేశానికి తనతోపాటు ఉన్నతాధికారులు హాజరు కానున్నట్టు తెలిపారు. ఈనెల 16న కేరళలో వెలుగుచూసిన సరికొత్త వైరస్‌ కర్ణాటకలోనూ ప్రవేశించిందని, వారం రోజుల్లో అనుమానంతో 2,619 మందికి పరీక్షలు నిర్వహించగా 81 మందికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. అయితే వీరికి సోకిన కొవిడ్‌ జేఎన్‌1 అనేది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉందన్నారు. మార్కెట్‌, మాల్స్‌ వంటి రద్దీ ప్రాంతాల్లో సంచరించాల్సిన సమయంలో పూర్తిస్థాయి అప్రమత్త త పాటించాలని ఆయన సూచించారు. మండ్య జిల్లా మద్దూరులో జేఎన్‌1 వెలుగు చూడడంతో ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో మృతి చెందిన వ్యక్తి వివరాలను ఆరోగ్యశాఖ వెల్లడించలేదు.

Updated Date - Dec 20 , 2023 | 11:08 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising