ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Covid: ‘కరోనా’తో ఒకరి మృతి.. మరో 40 మందికి పాజిటివ్..

ABN, Publish Date - Dec 31 , 2023 | 07:44 AM

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం రాష్ట్రంలో 40 కేసులు నమోదుకాగా, తిరువళ్లూర్‌ జిల్లాలో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో 2020 మార్చి నుంచి కరోనా వ్యాప్తి ప్రారంభం కాగా, దాన్ని నియంత్రించేలా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది.

- ప్రత్యేక వార్డుల ఏర్పాటు

పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం రాష్ట్రంలో 40 కేసులు నమోదుకాగా, తిరువళ్లూర్‌ జిల్లాలో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో 2020 మార్చి నుంచి కరోనా వ్యాప్తి ప్రారంభం కాగా, దాన్ని నియంత్రించేలా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. కరోనా టీకాలు వేసే ప్రక్రియ చేపట్టడంతో కొవిడ్‌(Covid) వ్యాప్తి నియంత్రణలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో, కొత్త కరోనా వేరియంట్‌ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రబలుతోంది. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో కొత్త రకం వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉండగా, రెండు వారాలుగా రాష్ట్రంలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య ప్రస్తుతం రెండెంకలకు చేరుకుంది. ఐదు నెలలుగా కరోనా మృతులు లేకపోగా, గురువారం రాజీవ్‌గాంధీ ప్రభుత్వాసుపత్రిలో కరోనా కారణంగా రాణిపేటకు చెందిన లక్ష్మి (55) మృతిచెందగా, శుక్రవారం తిరువళ్లూర్‌ జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్న 36 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. రాష్ట్రంలో శుక్రవారం 331 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 40 మంది కరోనా నిర్ధారణ అయింది. వారిలో చెన్నైలో 25 మంది, చెంగల్పట్టులో ఆరుగురు, కాంచీపురంలో నలుగురు, తిరువళ్లూర్‌లో ఇద్దరు, కోయంబత్తూర్‌, నామక్కల్‌, సేలం(Koimbatore, Namakkal, Salem) తదితర జిల్లాల్లో తలా ఒకరు కరోనా బారిన పడగా, ప్రస్తుతం ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్న వారిసంఖ్య 172కు చేరుకుంది.

సిద్ధంగా ప్రత్యేక వార్డులు...

కరోనా కొత్తరకం వైరస్‌ నియంత్రణకు చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రప్రభుత్వాలకు లేఖ రాసింది. అదే సమయంలో రాష్ట్రంలో కొత్తరకం జేఎన్‌-1 వైరస్‌ నలుగురికి సోకింది. చెన్నైలోనూ కరోనా బాధితులు పెరుగుతున్నారు. ప్రస్తుతం 82 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. దీంతో, రాజీవ్‌గాంధీ, కీల్పాక్కం, స్టాన్లీ, రాయపేట ప్రభుత్వాసుపత్రుల్లో కరోనా వార్డులు సిద్ధం చేశారు. ఈ వార్డుల్లో వెంటిలేటర్‌, ఆక్సిజన్‌ వసతి, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచడంతో పాటు వైద్యులు, నర్సులను నియమించారు. ఈ నేపథ్యంలో, గర్భిణులు, వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు బయటకు వెళ్లిన సమయంలో మాస్కులు ధరించాలని ఆరోగ్యశాఖ సూచించింది. అలాగే, కరోనా లక్షణాలున్న వారికి తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

కొత్త రకంపై భయపడొద్దు: మంత్రి సుబ్రమణ్యం

కొత్త రకం కరోనా వ్యాప్తిపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం చెప్పారు.

నగరంలో వర్షాకాల ప్రత్యేక శిబిరాలను శనివారం పరిశీలించిన మంత్రి విలేకరులతో మాట్లాడుతూ... కొత్త రకం వైర్‌సతో ప్రాణనష్టం అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిందన్నారు. కానీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మూడు రోజులకు పైగా జ్వర లక్షణాలున్న వారు ప్రభుత్వాసుపత్రులకు వెళ్లి చికిత్సలు చేయించుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితు చికిత్స కోసం 1.25 లక్షల పడకలతో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.

Updated Date - Dec 31 , 2023 | 07:44 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising