Covid: రాష్ట్రంలో భారీగా పెరిగిన ‘కరోనా’.. 24 గంటల్లో ఎంతమంది ఆస్పత్రి పాలయ్యారంటే..
ABN, Publish Date - Dec 30 , 2023 | 10:54 AM
రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 173 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. 27 మంది డిశ్చార్జ్ కాగా ఇద్దరు మృతి చెందారు. 702 మంది చికిత్సలు పొందుతున్నారు.
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 173 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. 27 మంది డిశ్చార్జ్ కాగా ఇద్దరు మృతి చెందారు. 702 మంది చికిత్సలు పొందుతున్నారు. బెంగళూరు(Bangalore)తోపాటు మైసూరు, దక్షిణకన్నడ జిల్లాల్లోనూ కేసులు అధికమవుతున్నాయి. బెంగళూరులో 82, మైసూరులో 16, దక్షిణకన్నడ 13, హాసన్ 9, విజయనగర్‌లో 7 కేసులు నమోదు కాగా మిగిలిన జిల్లాల్లో అంతకంటే తక్కువ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం బులెటిన్ ప్రకటించింది.
Updated Date - Dec 30 , 2023 | 10:54 AM