ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CPI Narayana: ‘చందమామ రావే జాబిల్లి రావే’ అన్నట్లుగా మహిళా బిల్లు

ABN, First Publish Date - 2023-09-22T11:49:24+05:30

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అనేక కాలంగా నలుగుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మగ అహంకార పూరిత సమాజం మహిళలకు రిజర్వేషన్లు అంత త్వరగా ఇవ్వడానికి ఒప్పుకోరన్నారు.

న్యూఢిల్లీ: మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అనేక కాలంగా నలుగుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Leader Narayana) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మగ అహంకార పూరిత సమాజం మహిళలకు రిజర్వేషన్లు అంత త్వరగా ఇవ్వడానికి ఒప్పుకోరన్నారు. చందమామ రావే జాబిల్లి రావే అంటూ చిన్నారికి అన్నం తినిపించినట్లు మహిళా బిల్లు పెట్టారని ఎద్దేవా చేశారు. మహిళా బిల్లుకు సీపీఐ మద్దతు ఇస్తుందన్నారు. మహిళ రిజర్వేషన్లు ఇప్పట్లో అమలు కావని..మహిళా రిజర్వేషన్లు ఇప్పుడే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మహిళల ఓట్ల కోసం మహిళా బిల్లు పెట్టారని విమర్శించారు. ఇండియా కూటమి (I.N.D.I.A) పెట్టాక బీజేపీ (BJP)భయపడుతోందని ఆయన అన్నారు.


మణిపూర్‌లో డబుల్ ఇంజన్ సర్కార్ విఫలం చెందిందన్నారు. మెయితిలు, కుకీలు కొట్టుకుంటుంటే కార్పొరేట్లకు భూములు అప్పగించే పని జరుగుతోందన్నారు. మణిపూర్‌ను కేంద్రమే రగిలిస్తుందని ఆరోపించారు. మణిపూర్ ముఖ్యమంత్రి నెంబర్ వన్ గంజాయి స్మగ్లర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కొనసాగితే దేశం రెండు ముక్కలు అవ్వడం ఖాయమన్నారు. ఉత్తర భారత దేశం.. దక్షిణ భారత దేశం అంటూ రెండుగా విడిపోతాయన్నారు. సనాతన ధర్మం పాటించాలి అంటున్నారని... బీజేపీ వారు భర్త చనిపోతే భార్యను సజీవ దహనం చేస్తారా అని ప్రశ్నించారు. దేశాన్ని ఇబ్బందులు పెట్టేలా బీజేపీ వ్యవహరిస్తుందని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-22T11:49:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising