ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dalai Lama : చైనా గెలుపు అసాధ్యం : దలైలామా

ABN, First Publish Date - 2023-01-01T15:40:39+05:30

టిబెటన్ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా (Dalai Lama) చైనాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Dalai Lama
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా : టిబెటన్ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా (Dalai Lama) చైనాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బౌద్ధ మతాన్ని నాశనం చేయాలని చైనా ప్రయత్నిస్తోందని, ఆ ప్రయత్నాల్లో ఆ దేశం విజయం సాధించబోదని చెప్పారు. ఆయన బిహార్‌లోని బుద్ధ గయ, కాలచక్ర మైదానంలో ప్రతి సంవత్సరం నిర్వహించే బోధనల కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

బౌద్ధ మతం విషపూరితమైనదని చైనా భావిస్తోందని, ఆ మతాన్ని నాశనం చేయడానికి పద్ధతి ప్రకారం ప్రయత్నిస్తోందని దలైలామా ఆరోపించారు. చైనా నుంచి ఆ మతాన్ని కూకటివేళ్లతో పెకలించడానికి ప్రయత్నిస్తోందన్నారు. ఆ మతానికి సంబంధించిన వ్యవస్థలను ధ్వంసం చేస్తోందన్నారు. అయితే ఆ మతాన్ని నాశనం చేయడంలో చైనా విఫలమైందని తెలిపారు.

బౌద్ధ ధర్మం పట్ల తమకు బలమైన నమ్మకం ఉన్నట్లు తెలిపారు. తాను హిమాలయ ప్రాంతాల్లో పర్యటించినపుడు స్థానికులు బౌద్ధ ధర్మాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించడాన్ని గమనించానని చెప్పారు. చైనా, మంగోలియాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందన్నారు. చైనా ప్రభుత్వం బౌద్ధ ధర్మాన్ని విషంగా చూస్తోందని, దానిని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. కానీ ఆ ధర్మాన్ని ధ్వంసం చేయడంలో చైనా విజయవంతం కాలేదన్నారు.

బౌద్ధ ధర్మానికి చైనా ప్రభుత్వం హాని చేసిందని, కానీ నాశనం చేయలేకపోయిందని చెప్పారు. నేటికీ చైనాలో బౌద్ధ ధర్మాన్ని విశ్వసించేవారు అనేక మంది ఉన్నారని చెప్పారు. అనేక బౌద్ధ విహారాలను ధ్వంసం చేసిందని, అయినప్పటికీ చైనాలో బౌద్ధ మతాన్ని అవలంబించేవారి సంఖ్య తగ్గలేదని చెప్పారు. తన పట్ల, బౌద్ధ మతం పట్ల విశ్వాసాన్ని ప్రదర్శించేవారు తాను బోధిస్తున్న బోధిచిత్తను కూడా అంగీకరించాలన్నారు. అది టిబెటన్ అయినా, మంగోలియన్ అయినా, చైనా అయినా, చైనాలో అనేక బౌద్ధ ఆరామాలు ఉన్నాయని చెప్పారు. తాను చాలాసార్లు చైనాకు వెళ్లానని తెలిపారు. అక్కడ నేటికీ అనేక బౌద్ధ విహారాలు ఉన్నాయన్నారు. ప్రజలు బౌద్ధాన్ని విశ్వసిస్తున్నారని, వారి మనసుల్లో బౌద్ధం ఉందని చెప్పారు. బౌద్ధంతో వారికి గొప్ప అనుబంధం ఉందని చెప్పారు. బౌద్ధంతో చైనీయులకు పురాతన సంబందాలు ఉన్నాయన్నారు.

వ్యక్తులు తమ సొంతం కోసం, ఇతరుల కోసం బోధిచిత్తను ఆచరించాలని కోరారు. టిబెటన్ సంప్రదాయాన్ని పరిశీలించినపుడు, షాక్యాస్ కూడా బోధిచిత్తను నిగమంలో ఆచరిస్తారన్నారు. బోధిచిత్త మనసు, శరీరాలపై ప్రభావం చూపుతూ, జీవితకాలం ఎక్కువగా ఉండేలా చేస్తుందన్నారు. దీనివల్ల నిద్ర బాగా పడుతుందన్నారు. అందరి సంక్షేమం విషయంలో కూడా దీనికన్నా ఉత్తమమైనదేదీ లేదని చెప్పారు. బోధిచిత్తను ఆచరించడం ద్వారా మనలోని చెడు, విచారాలను తొలగించుకోవచ్చునని చెప్పారు.

కాలచక్ర మైదానంలో శుక్రవారం నుంచి దలైలామా ప్రసంగాలు, బోధనలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు ఆదివారం ముగిశాయి.

Updated Date - 2023-01-01T15:40:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising